ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Lokesh: సీఎం జగన్​కు నారా లోకేశ్​ లేఖ..ఎందుకంటే..!

By

Published : Apr 28, 2022, 12:26 PM IST

Nara Lokesh letter to CM Jagan: ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి జగన్​కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ లేఖ రాశారు. మ‌ద్దతు ధ‌ర‌తో ఖ‌రీఫ్ ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని, ధాన్యం బ‌కాయిలు త‌క్షణ‌మే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 2021-22 ఖరీఫ్ సీజన్​లో ఇంకా 42 ల‌క్షల ట‌న్నులకుపైగా ఖ‌రీఫ్ ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

Nara Lokesh letter to CM Jagan
సీఎం జగన్​కు నారా లోకేశ్​ లేఖ

Nara Lokesh letter to CM Jagan: 'ధాన్యం రైతుల దైన్యం'పై ముఖ్యమంత్రి జగన్​కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ లేఖ రాశారు. మ‌ద్దతు ధ‌ర‌తో ఖ‌రీఫ్ ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని, ధాన్యం బ‌కాయిలు త‌క్షణ‌మే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాజ‌న్న రాజ్యమంటేనే రైత‌న్న రాజ్యమ‌ని జగన్‌ ఇచ్చిన భ‌రోసా.. ఆచ‌ర‌ణ‌లో ఎక్కడా క‌నిపించ‌డంలేదని విమర్శించారు. పొలాల వ‌ద్దే రైతుల నుంచి పంట‌లను మ‌ద్దతు ధ‌ర‌కు కొనుగోలు చేస్తామ‌ని జగన్‌ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో రైతాంగం నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు జ‌ర‌ప‌కుండానే ర‌బీ కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించ‌డం అన్యాయమన్నారు.

2021-22 ఖరీఫ్ సీజన్​లో ఇంకా 42 ల‌క్షల ట‌న్నులకుపైగా ఖ‌రీఫ్ ధాన్యం కొనుగోలు చేయాల్సిఉందని పేర్కొన్నారు. ర‌బీ ధాన్యాన్ని కూడా పూర్తిస్థాయిలో కొనడంలేదని లోకేశ్‌ దుయ్యబట్టారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 7 లక్షల టన్నులకు పైగా ధాన్యం సేకరణ తగ్గిందన్నారు. అర‌కొర ధాన్యం కొనుగోలు చేసి రైతుల‌కు వెయ్యి కోట్ల రూపాయల వ‌ర‌కు బ‌కాయిలు పెట్టారని మండిపడ్డారు. రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన రైతుభ‌రోసా కేంద్రాలు వైకాపా సేవ‌లో త‌రిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండించిన ధాన్యం కొనుగోలు జ‌ర‌గ‌క‌ పెట్టుబ‌డుల‌కు తెచ్చిన అప్పులు, వ‌డ్డీలు పెరిగి రైతులు ద‌య‌నీయ స్థితిలో తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారని లోకేశ్‌ దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: Audio Viral: చెవిరెడ్డి పల్లెబాట విజయవంతానికి తంటాలు.. మహిళా సంఘాలకు బెదిరింపులు

ABOUT THE AUTHOR

...view details