ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరద కష్టాలు : చినరాజప్ప

By

Published : Oct 17, 2020, 6:12 PM IST

వైకాపా ప్రభుత్వం విపత్తులను ఎదుర్కొవడంలో పూర్తిగా విఫలమైందని తెదేపా నేత, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజలకు వరద కష్టాలు వచ్చాయని విమర్శించారు.

Chinarajappa
Chinarajappa

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలకు వరద కష్టాలు వచ్చాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఏడాదిన్నరగా మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వరుస విపత్తులతో రైతులు నష్టపోయినా ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

ముంపు ప్రాంతాల్లో ఉన్నవారికి ఆహారం, తాగునీరు కూడా అందించలేదని చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బాధితులకు సహాయక చర్యలు చేపట్టి ఉచిత వైద్య శిచిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయశాఖ, జలవనరులశాఖ మంత్రులకు ముందుచూపు లేకపోవడం వల్ల వరదలతో రైతులు నష్టపోయారు. కన్నబాబు, అనిల్ కుమార్​కు చంద్రబాబును విమర్శించడం తప్ప... వేరే ధ్యాస లేదు. చంద్రబాబు ఇంటి గురించి తప్ప ప్రజలకు గురించి పట్టదు. మూడుసార్లు పంటలు నష్టపోయి రైతులు నిరాశలో ఉంటే వారిని ఆదుకునేందుకు చర్యలు లేవు. ఇన్​పుట్​ సబ్సిడీ ఇవ్వలేదు.

---చినరాజప్ప, తెదేపా ఎమ్మెల్యే

ఇదీ చదవండి :రైల్వే గేటుతో తంటా... పరిష్కారం ఎప్పుడంటా..?

ABOUT THE AUTHOR

...view details