ఆంధ్రప్రదేశ్

andhra pradesh

maha padayatra: అమరావతిని కాపాడుకోకపోతే రాష్ట్ర భవిష్యత్ అంధకారమే: చంద్రబాబు

By

Published : Nov 1, 2021, 12:23 PM IST

అమరావతి పరిరక్షణ కోసం రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర(amaravati farmers Maha Padayatra)కు తెదేపా అధినేత చంద్రబాబు(TDP chief Chandrababu) సంఘీభావం తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వారంతా పాదయాత్రకు మద్దతు తెలపాలని సూచించారు. ఇది పాదయాత్ర కాదని రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్రని పేర్కొన్నారు.

Chandrababu
Chandrababu

ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి అమరావతి(amaravati) ప్రతీకని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(TDP chief Chandrababu) స్పష్టం చేశారు. అమరావతి పరిరక్షణ కోసం రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు(amaravati farmers Maha Padayatra) ఆయన సంఘీభావం తెలిపారు. ఇది పాదయాత్ర కాదని రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్రని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కన్నతల్లి లాంటి భూముల్ని త్యాగం చేసిన పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమంగా అభివర్ణించారు. అమరావతి ఉద్యమంపై పాలక పక్షం ఎన్ని అసత్య ప్రచారాలు, అవహేళనలు, అవమానాలకు గురి చేసినా అద‎రక, బెదరక అనుకున్న ఆశయ సాధన కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం చేస్తున్న ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

ఈ మహాపాదయాత్ర(Maha Padayatra) ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలని చంద్రబాబు(Chandrababu) ఆకాంక్షించారు. అహంకారంతో మూసుకుపోయిన ముఖ్యమంత్రి కళ్లు తెరుచుకోవాలన్నారు. పగలు, ప్రతీకారాలు, కూల్చివేతలు, రద్దులపై చూపుతున్న శ్రద్ద రాష్ట్రాభివృద్ధిపై చూపడం లేదని మండిపడ్డారు.అమరావతి నిర్మాణంతో స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతున్న తరుణంలో 3 రాజధానుల పేరుతో రివర్స్ పాలనకు తెరలేపారని ధ్వజమెత్తారు. అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేమన్న చంద్రబాబు... అమరావతిని కాపాడుకోలేకపోతే రాష్ట్రం అంధకారమవుతుందన్నారు. రైతుల మహాపాదయాత్రకు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. అమరావతి రైతుల మహాపాదయాత్ర

ABOUT THE AUTHOR

...view details