ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా పై పోరుకు...'స్వర'హస్తం!

By

Published : May 10, 2020, 1:24 PM IST

కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి అవసరమైన నిధులు సేకరించటానికి.. స్వర వేదిక అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. అమెరికాలోని 10 మహనగరాల్లో సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

swaravedika volunteer organization services
కరోనా పై పోరుకు...'స్వర'హస్తం

ఈటీవీ ఆధ్వర్యంలో.. అమెరికాలో నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు.. సమాజ సేవకు నడుం కట్టారు. స్వరవేదిక పేరుతో స్వచ్చంద సేవా సంస్థను మహోన్నత ఆశయంతో ప్రారంభించారు. వెనకబడిన పిల్లలకు, అనాథలకు ఈ వేదికతో సహాయం చేసేందుకు కృషి చేస్తున్నారు.

201 6లో 17 మంది పిల్లలతో ప్రారంభమయిన ఈ స్వరవేదిక.. అమెరికాలోని ఎన్నో నగరాల్లో సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. గత 4 సంవత్సరాలలో 25కు పైగా కార్యక్రమాలు చేసి భారత, అమెరికా దేశాల్లో 20,000 మంది పేద విద్యార్ధులకు చేయూతనందించింది. తిత్లీ, హుద్ హుద్ తుఫాను బాధితులెంతోమందికి స్వరవేదిక ఆసరాగా నిలిచింది.

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి అవసరమైన నిధులు సేకరించటానికి, స్వరయోకి అనే సంగీత కార్యక్రమాన్ని ఆన్​లైన్, ప్రసార మాధ్యమాల ద్వారా అమెరికాలోని 10 మహానగరాల్లో నిర్వహించింది. ఇవే కాక స్వరరాగ అనే శాస్త్రీయ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించి... అనేక మంది అభ్యుదయ గాయనీగాయకులకు తమ గానాన్ని ప్రదర్శించటానికి అవకాశం కల్పించి వారిని ఎంతో ప్రోత్సహించింది.

స్వరవేదిక సేవా కార్యక్రమాలు:

* అమెరికాలో ఆరోగ్య, రక్షణ సిబ్బంది కోసం 10,000 మాస్కులు కుట్టటం

* హైదరాబాదులోని మహావీర్ ఆసుపత్రి సిబ్బంది కోసం 500 పీపీఈలు అందించటం

* ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వలస కార్మికులకు 45 రోజులకు సరిపడా 20,000 ఆహార పొట్లాలను అందించటం

* న్యూయార్క్​ ప్రెస్ బైటేరియన్ ఆసుపత్రిలోని సిబ్బందికి భోజనాలు అందించటం

  • ఈ సంవత్సరం జూన్, జులై, ఆగస్ట్ నెలల్లో మరెన్నో సంగీత, వినోద కార్యక్రమాలను ఆన్​లైన్ ద్వారా ప్రదర్శించటానికి స్వరవేదిక నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
  • ప్రస్తుతం హైస్కూల్ , కళాశాలల్లో చదువుతున్న ఈ స్వరవేదిక యువ కార్యకర్తలు, కొవిడ్-19 సంబంధిత సేవల కోసం కొన్ని వందల గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో అంతా తోడుగా నిలబడతారని.. అంతా తమ ప్రోత్సాహాన్ని, సహాయాన్ని అందిస్తారని.. భావి తరాలకు వారు స్ఫూర్తిగా నిలిచేలా ఆశీర్వదిస్తారని స్వరవేదిక ఆశిస్తోంది... ఆకాంక్షిస్తోంది.

ఇవీ చదవండి:

మరో 50 మందికి పాజిటివ్: రాష్ట్రంలో కరోనా కేసులు 1980

ABOUT THE AUTHOR

...view details