ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలుగు అకాడమీ విభజనపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలి: సుప్రీం

By

Published : Mar 22, 2021, 5:19 PM IST

తెలుగు అకాడమీ ఉద్యోగులు, ఆస్తుల పంపకాలపై సుప్రీం విచారణ చేపట్టింది. నెల రోజుల్లో ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని సూచించింది. అకాడమీ విభజనపై ఏకాభిప్రాయానికి రాకపోతే తామే విచారణ చేపడతామని తెలిపింది.

telugu academy
telugu academy

తెలుగు అకాడమీ ఉద్యోగులు, ఆస్తుల పంపకాలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. నెల రోజుల్లో ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని సూచించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం విచారణ చేసి... ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

ఉద్యోగుల పంపకం, ఆస్తులు - అప్పులపై తెలంగాణ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసింది. అకాడమీ విభజనపై ఏకాభిప్రాయానికి రాకపోతే విచారణ చేపడతామని సుప్రీం పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details