ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రష్యా నుంచి హైదరాబాద్​కు చేరుకున్న స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్లు

By

Published : May 16, 2021, 12:31 PM IST

తాజాగా రష్యా నుంచి రెండో విడత స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్లు హైదరాబాద్​లోని శంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకున్నాయి. వచ్చేవారం నుంచి ఈ టీకాను పంపిణీ చేయనున్నందున ముందస్తుగా వీటిని భారత్​కు రప్పించారు.

sputnik-v vaccines reached hyderabad
రష్యా నుంచి హైదరాబాద్ కు చేరుకున్న స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్లు

రష్యా నుంచి హైదరాబాద్​కు చేరుకున్న స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్లు

రష్యా నుంచి స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్లు హైదరాబాద్‌ చేరాయి. రెండో విడతలో 60 వేల డోసులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. అక్కడికి నుంచి వాటిని నేరుగా రెడ్డీస్‌ ల్యాబ్‌కు తరలించారు. 67 లక్షల డోసులు కావాలంటూ.. రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి- ఆర్​డీఐఎఫ్​ కు సంస్థ విజ్ఞప్తి చేయగా... రష్యా వాటిని విడతల వారీగా పంపిస్తోంది.

వచ్చే వారం దేశంలో టీకా పంపిణీ ప్రారంభం కానుంది. జూన్‌ నుంచి దేశంలోనే స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నట్లు రెడ్డీస్‌ ల్యాబ్‌ ఇప్పటికే ప్రకటించింది. టీకాను రష్యాకు చెందిన గమలేయ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎపిడెమాలజీ అండ్‌ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది.

ABOUT THE AUTHOR

...view details