ఆంధ్రప్రదేశ్

andhra pradesh

SIRPURKAR COMMISION: ఐసీయూలో ఎందుకు చేర్చారు.. వైద్యునికి ప్రశ్నల వర్షం

By

Published : Oct 9, 2021, 9:56 AM IST

SIRPURKAR COMMISION

తెలంగాణలో సంచలనం రేపిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. కానిస్టేబుల్ అరవింద్‌కు చికిత్స అందించిన కేర్ ఆస్పత్రి వైద్యుడు రాజేశ్​ను ప్రశ్నించింది. అరవింద్​కు సాధారణ వైద్యమే అందించినప్పటికీ అత్యవసర చికిత్సా విభాగంలో ఎందుకు చేర్చారని కమిషన్ ప్రశ్నించింది.

తెలంగాణలో జరిగిన దిశ నిందితుల కాల్పుల్లో గాయపడ్డ కానిస్టేబుల్ అరవింద్‌కు అందించిన వైద్యం గురించి డిశ్చార్జ్ సమ్మరీలో ఎందుకు పూర్తిగా నమోదు చేయలేదని కేర్ ఆస్పత్రి వైద్యుడు రాజేశ్​ను సిర్పూర్కర్‌ కమిషన్ ప్రశ్నించింది. అరవింద్​కు సాధారణ వైద్యమే అందించినప్పటికీ అత్యవసర చికిత్సా విభాగంలో ఎందుకు చేర్చారని కమిషన్ ప్రశ్నించింది.

దీంతో అత్యవసర సేవల విభాగానికి చెందిన వైద్యులు సూచించడంతో ఐసీయూలో చికిత్స అందించినట్లు డాక్టర్ రాజేశ్​ తెలిపారు. అరవింద్‌కు అందించిన వైద్యం, ఇంజెక్షన్ల గురించి నివేదికలో ఎందుకు పొందుపరచలేదని కమిషన్ ప్రశ్నించగా.. నర్సింగ్ స్టాఫ్ పూర్తి వివరాలు నమోదు చేయలేదని రాజేష్ సమాధానమిచ్చారు. ఎన్​కౌంటర్​లో పోలీసులు ఉపయోగించిన ఆయుధాలు, వాటి సామర్థ్యం గురించి హైదరాబాద్ ఎఫ్​ఎస్​ఎల్ఎడీతో పాటు దిల్లీకి చెందిన ఫోరెన్సిక్ నిపుణుడిని సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నించింది. శనివారం కూడా కేర్ ఆస్పత్రి వైద్యుడు రాజేశ్​ను మరోసారి కమిషన్ ప్రశ్నించనుంది.

ఇదీ చదవండి:

Hyderabad Rains: భాగ్యనగరంలో భారీ వర్షం.. చెరువుల్లా మారిన రహదారులు

ABOUT THE AUTHOR

...view details