ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ys Sharmila: రేపు హుజూరాబాద్ నియోజకవర్గంలో షర్మిల నిరాహార దీక్ష

By

Published : Aug 9, 2021, 9:15 PM IST

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో రేపు వైఎస్​ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం- నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలో ఆమె పాల్గొంటున్నారు.

Ys Sharmila
Ys Sharmila

రేపు తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సిరిసేడు (Siricedu) గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (Ysrtp) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Ys Sharmila) నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం- నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలో భాగంగా ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొనున్నారు.

సిరిసేడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహమ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆ గ్రామంలో వైఎస్ షర్మిల ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. వైఎస్​ఆర్ తెలంగాణ పార్టీ.. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా, నిరాహార దీక్ష వారంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వారంగా ప్రకటిస్తున్నట్లు వైఎస్​ షర్మిల గతంలో చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details