ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈ అమ్మాయి... అబ్బాయిల క్రికెట్ టీమ్‌లో ఆడేసింది!

By

Published : Jul 5, 2020, 9:30 AM IST

క్రికెట్‌ అంటే జెంటిల్​మెన్ గేమ్‌ మాత్రమే కాదు, అమ్మాయిల ఆట కూడా అని ఇప్పటికే చాలామంది నిరూపించారు. శరణ్యా సదారంగని...మరో అడుగు ముందుకేసి అబ్బాయిలతో కలిసి క్రికెట్‌ ఆడేసింది. ‘యూరోపియన్‌ క్రికెట్‌ సిరీస్‌’లో ఆడిన మొదటి మహిళగా రికార్డునీ సృష్టించింది.

sharanya-sadarangani-becomes-first-women-cricket-player-ecs-t10-league
శరణ్య... 'యూరోపియన్ క్రికెట్ సిరీస్'లో మొదటి మహిళ

శరణ్యా సదారంగని.... క్రికెట్‌లో అరుదైన రికార్డు దక్కించుకుంది. డ్రీమ్‌ లెవెన్‌ ‘యూరోపియన్‌ క్రికెట్‌ సిరీస్‌’లో ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా గుర్తింపు సాధించింది. ఐసీసీ గుర్తింపు ఉన్న ఈ లీగ్‌లో పురుషులతోపాటు మహిళా క్రికెటర్లూ ఆడేందుకు అనుమతి ఉంది. ఐరోపా దేశాలకు చెందిన జట్లు పాల్గొనే ఈ ‘టీ10 టోర్నీ’ తాజా లీగ్‌ గత నెల చివర్లో మొదలైంది. దీంట్లో జర్మనీకి చెందిన కేఎస్‌వీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది శరణ్య.

పరుగులేమీ చేయకుండానే రనౌట్

లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో ‘పీఎస్‌వీ హన్‌ ముండెన్‌’ పై పదకొండో స్థానంలో బ్యాటింగ్‌కి దిగిన శరణ్య... 5 బంతులు ఆడి పరుగులేమీ చేయకుండా రనౌట్‌ అయింది. అయితే వికెట్‌ కీపర్‌గా అద్భుతంగా రాణించింది. బౌలర్లు ఎంతో వేగంగా బంతులు వేసినా వికెట్ల వెనక చురుగ్గా కదులుతూ అందుకుని అందరినీ మెప్పించింది. ఓ కష్టసాధ్యమైన క్యాచ్‌ని పట్టింది కూడా. 24 ఏళ్ల శరణ్య... ఆరేళ్లుగా డెన్మార్క్‌, ఇంగ్లండ్‌లలో మహిళా లీగ్‌లు ఆడుతోన్న ఈమె క్రికెట్‌లో ఓనమాలు దిద్దింది భారత్‌లోనే.

ఇవీ చదవండి...

ఈ యువకుడు కన్నుమూయడం కన్నీరు తెప్పిస్తోంది

ABOUT THE AUTHOR

...view details