ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మహ జాతరలో నిర్లక్ష్యం.. పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

By

Published : Feb 6, 2020, 8:09 PM IST

తెలంగాణలో జరుగుతున్న మేడారం మహా జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ అంతంతమాత్రంగానే సాగుతోంది. దేవాలయం నుంచి జంపన్నవాగు వరకు భక్తులు వేసుకున్న గుడారాల వద్ద చెత్తను తీసివేయడంలో అధికారులు అలసత్వం చూపిస్తున్నారు.

sanitation-works
sanitation-works

మహ జాతరలో నిర్లక్ష్యం.. పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

తెలంగాణలో జరుగుతున్న మేడారం జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ నత్తనడకన సాగుతోంది. అమ్మవార్ల గద్దెలు, దేవాలయం పరిసరాల్లో మాత్రమే పారిశుద్ధ్యం, శుభ్రతపై శ్రద్ద చూపుతున్న అధికారులు.. దేవాలయం నుంచి జంపన్నవాగు వరకు భక్తులు వేసుకున్న గుడారాల వద్ద మాత్రం చెత్తను తీసివేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.

జాతరలో తిని పడేేసిన పేపర్ ప్లేట్లు, ఇతరాత్ర వ్యర్థాలను ఒక చోట వేయడానికి చెత్త కుండీల వంటి సదుపాయాలను కల్పించలేదు. మైదాన ప్రాంతాల్లో వేసిన వ్యర్థాలు గాలికి చెల్లాచెదురుగా పడ్డాయి. అవి ఎగిసిపడి గుడారాల్లోకి వచ్చి పడుతున్నాయి. పరిసరాలు దుర్వాసన వెదజల్లుతున్నాయని భక్తులు వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details