ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Revanth Reddy Tweet: 'కీచక రాఘవ ఎక్కడ.?.. ప్రగతిభవన్‌లోనా.. ఫామ్‌హౌస్‌లోనా..'

By

Published : Jan 7, 2022, 1:25 PM IST

Revanth tweet on Vanama Raghava: పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిని ఇంకా అరెస్టు చేయకపోవడంపై ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనమా రాఘవ ఎక్కడున్నాడంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి.. ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు.

Revanth Reddy Tweet
Revanth Reddy Tweet

Revanth tweet on Vanama Raghava: రామకృష్ణ ఆత్మహత్యకు కారణమైన వనమా రాఘవ ఎక్కడ అంటూ... తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లోనా లేదా ఫామ్‌హౌస్‌లో ఉన్నాడా? అని అన్నారు. అక్రమాలను ప్రశ్నించేవారిని నిమిషాల్లో అరెస్టు చేస్తున్నారు. రాఘవను రోజుల తరబడి పట్టుకోలేకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు.

దారుణమైన ఘటనపై తెరాస పెద్దల మౌనానికి అర్థమేంటని రేవంత్​ అన్నారు. అలాంటి దుర్మార్గుడిని కాపాడుతున్న అదృశ్యశక్తి ఎవరని ప్రశ్నించారు.

కొనసాగుతున్న బంద్​

పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవను కఠినంగా శిక్షించాలంటూ విపక్షాలు కదం తొక్కాయి. నిందితులను శిక్షించాలంటూ... కొత్తగూడెంలో విపక్షపార్టీలు, వామపక్షాలు, ప్రజాసంఘాలు చేస్తున్న బంద్‌ కొనసాగుతోంది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల ఐకాస ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహిస్తున్నాయి. బస్టాండ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ నాయకుల ధర్నా చేపట్టి... బస్సులను అడ్డుకుంటున్నారు.

ఇదీ చదవండి:పాల్వంచ ఘటనలో కొత్త ట్విస్ట్​.. వనమా రాఘవ దొరకలేదంటున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details