ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MURDER: హత్య చేసి.. కారు డిక్కీలో పెట్టి తగలబెట్టారు!

By

Published : Aug 10, 2021, 2:50 PM IST

ఓ వ్యక్తిని హత్య చేసి... కారు డిక్కీలో పెట్టి దుండగులు నిప్పు పెట్టిన ఘటన తెలంగాణలోని మెదక్​ జిల్లాలో చోటు చేసుకుంది. కారుతో పాటు పూర్తిగా దగ్ధమైన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

హత్య
MURDER

MURDER

కారులో ఓ వ్యక్తిని పెట్టి దహనం చేసిన ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం మంగళ పర్తి శివారులో రోడ్డు పక్కన హోండా సిటీ కాలిపోయి ఉండటాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పరిశీలించి.. డిక్కీలో పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు.

కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా వాహనాన్ని మెదక్ పట్టణానికి చెందిన శ్రీనివాస్‌దిగా గుర్తించారు. అందులో మృతదేహం సైతం అతనిదేనని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. స్థిరాస్తి వ్యాపార లావాదేవీలే హత్యకు కారణం కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఆయన భార్య హైందావతి నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఆధారాలు సేకరిస్తున్నారని.. అనంతరం మృతదేహాన్ని తరలిస్తామని పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details