ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉత్తర, దక్షిణ కోస్తాలో.. రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం

By

Published : May 5, 2021, 3:30 PM IST

ఉత్తర, దక్షిణ కోస్తాలో నేడు, రేపు... ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నట్లు.. అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.

rains
rains

ఉత్తర, దక్షిణ కోస్తాలో నేడు, రేపు ఉరుములు, మెరుపులుతో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి. మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది.

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో.. గాలులు వీయనున్నట్లు పేర్కొంది. రాయలసీమలో సైతం నేడు, రేపు ఉరుములు, మెరుపులుతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల, తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details