ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: రైతుల కోసం ఆలోచన.. యంత్రంగా రూపకల్పన!

By

Published : Aug 12, 2020, 11:36 AM IST

ఓ మెకానిక్​ తక్కువ ఖర్చుతో పవర్‌టిల్లర్‌ రూపొందించారు. కేవలం రూ.45 వేల ఖర్చుతో కలుపుతీత, అంతర్గతంగా దున్నడానికి అనువుగా ఉండే పవర్‌టిల్లర్‌ను తయారు చేశారు.

power-tiller-was-designed-by-kishan-in-rajanna-sirisilla-district
రైతుల కోసం ఆలోచన.. యంత్రంగా రూపకల్పన!

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌ గ్రామానికి చెందిన రాగి కిషన్‌ డీజిల్‌ మెకానిక్‌. పత్తి చేనులో కలుపుతీతకు కూలీలు దొరక్క రైతులు పడుతున్న అవస్థలు, అధిక ఖర్చును దృష్టిలో ఉంచుకుని పరిష్కారం కనుగొనాలని ఆయన భావించారు. కేవలం రూ.45 వేల ఖర్చుతో కలుపుతీత, అంతర్గతంగా దున్నడానికి అనువుగా ఉండే పవర్‌టిల్లర్‌ను రూపొందించారు.

‘ఇందులోని మూడు పళ్ల నాగలితో, 3 లీటర్ల డీజిల్‌ను వినియోగించి 2 గంటల వ్యవధిలో ఎకరం పొలాన్ని దుక్కి దున్నడంగానీ, కలుపుతీయడంగానీ చేయవచ్చు. అవసరానికి అనుగుణంగా నాగలి, బ్లేడ్‌ను అమర్చుకోవచ్చు. గేర్‌లు లేకుండా యాక్సిలరేటర్‌తోనే ఇది పరుగుపెడుతుంది. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మట్టిలో కూరుకుపోకుండా కేజ్‌వీల్స్‌ను వినియోగించుకునేందుకూ వీలుంది. డిస్క్‌బ్రేక్‌ సాయంతో దీన్ని నియంత్రించవచ్చు. ఇది సగటు రైతుకు బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతుంది’ అని కిషన్‌ వెల్లడించారు. దీని తయారీకి నెల రోజులు పట్టిందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details