ఆంధ్రప్రదేశ్

andhra pradesh

PV Sindhu:పీవీ సింధు ఫొటోతో ప్రత్యేక తపాలా కవర్‌

By

Published : Aug 29, 2021, 10:58 PM IST

తెలుగు తేజం పీవీ సింధును తపాలా శాఖ తనదైన పద్ధతిలో గౌరవించింది. పీవీ సింధు ఫొటోతో ప్రత్యేక తపాలా కవర్‌ విడుదల చేసింది. హైదరాబాద్​లో ఈ కార్యక్రమం జరిగింది.

పీవీ సింధు ఫొటోతో ప్రత్యేక తపాలా కవర్‌
పీవీ సింధు ఫొటోతో ప్రత్యేక తపాలా కవర్‌

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు తేజం పీవీ సింధును తపాలా శాఖ గౌరవించింది. సింధు ఫొటోతో ప్రత్యేక తపాలా కవర్​ను విడుదల చేసింది. హైదరాబాద్​లో పోస్టుమాస్టర్‌ జనరల్‌ ఈ తపాలా కవర్‌ను ఆవిష్కరించారు.

గర్వంగా ఉంది..

పీవీ సింధు ఫొటోతో ప్రత్యేక తపాలా కవర్‌

తన ఫొటోతో ప్రత్యేక తపాలా కవర్​ విడుదల చేయటంపై పీవీ సింధు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘనతకు సంబంధించి.. సింధు ఇంట్లో పది వేల మంది అభిమానుల నుంచి ఈ- మెస్సేజ్​లు అందుకున్నారు. ఇంత మంది ప్రేమాభిమానాలు పొందటం ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.

గర్వకారణంగా నిలిచింది..

ఇటీవలే జరిగిన టోక్యో ఒలంపిక్స్​లో పీవీ సింధు కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు జరిగిన రియో ఒలింపిక్స్​లో రజత పతకం కైవసం చేసుకుంది. వరుసగా రెండు పతకాలు తన ఖాతాలో వేసుకున్న మహిళగా రికార్డు సొంతం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచింది. తర్వాత జరగబోయే ఒలింపిక్స్ లోనూ పతకాన్ని సాధిస్తానని దీమా వ్యక్తం చేస్తోంది.. తెలుగు తేజం సింధు.

ఇదీ చూడండి:

ఈమె కన్న తల్లేనా? పసి బిడ్డపై మరీ ఇంత పైశాచికత్వమా?

ABOUT THE AUTHOR

...view details