ఆంధ్రప్రదేశ్

andhra pradesh

న్యాయవాదుల మర్డర్ కేసులో పోలీసుల నిర్లక్ష్యం

By

Published : Feb 18, 2021, 10:01 AM IST

తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లిలో జరిగిన న్యాయవాద దంపతుల దారుణ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పట్టపగలు, నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే... గట్టు వామన్ రావు, నాగమణి దంపతులను కత్తులతో నరికి చంపడంపై తీవ్ర విమర్శలు, ఆందోళన వ్యక్తమవుతోంది. కానీ ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. హత్య జరిగిన ప్రాంతంలో ఆధారాలు కాపాడటంలో పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

high court lawyers murders
న్యాయవాదుల మర్డర్ కేసులో పోలీసుల నిర్లక్ష్యం

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో.. పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నేరస్థలిలో ఆధారాల (సీన్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌)ను కాపాడటంలో పోలీసుల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. హత్య జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు చెదిరిపోకుండా చూడటంలో ఘోరంగా విఫలమయ్యారు. క్లూస్‌ టీం వచ్చే వరకు ఎవరూ అక్కడ అడుగుపెట్టకుండా, ఆధారాలు చెరిపేయకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక పోలీసులదే.

ఇక్కడ మాత్రం పోలీసులు ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. రోడ్డు పక్కన ఉన్న ముళ్లకంపల్ని తీసుకొచ్చి అడ్డంగా పెట్టారు. కనీసం అక్కడికి ఎవరూ రాకుండా చూశారా? అంటే అదీ లేదు. సంఘటన గురించి తెలిసి వచ్చిన అనేకమంది యథేచ్ఛగా మృతుల కారు వద్దకు వచ్చి వెళ్తున్నా ఆపలేకపోయారు. వాస్తవానికి ‘సీన్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌’ చెదిరిపోకుండా ఉండేందుకు పోలీసులు సంఘటన స్థలం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలి.

కాని ఇక్కడ ముళ్ల కంప వేసి చేతులు దులుపుకోవడం.. నాలుగు గంటల తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొనడం నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచింది. ‘నేరస్థలిని 3డీ ఇమేజింగ్‌ చేస్తాం.. అక్కడ లభించిన ఆధారాల్ని డిజిటలైజ్‌ చేస్తాం.. కీలకమైన ఆధారాలను కోర్టుకు సమర్పించి నిందితులకు శిక్ష పడేలా చేస్తాం..’ అని ఉన్నతాధికారులు సాధారణంగా చెప్పే మాటలు. కాని వాస్తవ పరిస్థితులు మాత్రం ఇలా ఉండడం విశేషం.

ఇదీ చూడండి:తెలంగాణ: హైకోర్టు న్యాయవాది దంపతులను నరికి చంపిన దుండగులు

ABOUT THE AUTHOR

...view details