ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఆ విషయం తెలిసుంటే 'ఆంగ్లం' నిర్ణయం తీసుకునేవారు కాదు'

By

Published : Nov 10, 2019, 10:54 AM IST

తెలుగు భాష, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో వైకాపా నాయకత్వం.. తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. హైదరాబాద్‌లో 2017 లో నిర్వహించిన ‘తెలుగు మహాసభల’ కోసం 'తొలిపొద్దు'అనే పుస్తకాన్ని తీసుకువచ్చారని ట్వీట్ చేశారు.

'తెలుగు భాష  గొప్పదనం తెలుసుంటే 'ఆంగ్లం' నిర్ణయం తీసుకునేవారు కాదు'

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిషేధించాలనే ఏపీ ప్రభుత్వ విధానం.. తన గ్రంథాలయంలోని ‘తెలుగు పుస్తకాలను ఎంతో ఆరాధనతో, ప్రేమతో, శ్రద్ధతో చూసేలా చేసిందని జనసేనాని అన్నారు. తెలుగు భాష గొప్పదనాన్ని నిజంగా అర్థం చేసుకుని ఉంటే..ఆంగ్ల విధానం నిర్ణయం తీసుకునే వారు కాదని అభిప్రాయపడ్డారు. భాష, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో వైకాపా నాయకత్వం... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలు తెలుగు పుస్తక ముఖ చిత్రాలను పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పొస్ట్ చేశారు.

'తెలుగు భాష గొప్పదనం తెలుసుంటే 'ఆంగ్లం' నిర్ణయం తీసుకునేవారు కాదు'
Intro:Body:Conclusion:

TAGGED:

ABOUT THE AUTHOR

...view details