ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Adviser to AP Govt: ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి.. ఉత్తర్వులు జారీ

By

Published : Nov 1, 2021, 5:03 PM IST

ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి(chandrasekhar reddy)ని ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

chandrasekhar reddy appointed as adviser to ap government
chandrasekhar reddy appointed as adviser to ap government

ప్రభుత్వ సలహాదారుగా ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు(chandrasekhar reddy appointed as adviser to ap gov news). ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో ఆయన సలహాదారుగా వ్యవహారించనున్నారు. రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా.. చంద్రశేఖర్ రెడ్డిపై పలు అంశాల్లో ఆరోపణలు ఉన్నందున ఆయనకు సలహాదారు పదవి ఇవ్వొద్దంటూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. అయినప్పటికీ సర్కార్​.. చంద్రశేఖర్ రెడ్డిని సలహాదారుగా నియమిస్తూ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details