ఆంధ్రప్రదేశ్

andhra pradesh

NTR Trust Help : టెన్త్​ విద్యార్థినులకు నారా భువనేశ్వరి సాయం

By

Published : Nov 23, 2021, 8:50 AM IST

NTR Trust Help
పదవ తరగతి విద్యార్థినులకు నారా భువనేశ్వరి సాయం ()

ఎన్‌టీఆర్‌ విద్యాసంస్థల్లో పదవ తరగతి చదివే విద్యార్థినులకు బాలికల విద్యా ఉపకారవేతనం పరీక్ష(Girls Education Scholarship Test-GEST)ను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థినులకు ఎన్‌టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.

ఎన్‌టీఆర్‌ విద్యాసంస్థలు గత ఏడేళ్లుగా నిర్వహిస్తున్న గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (జీఈఎస్‌టీ) ఈ ఏడాది డిసెంబర్‌ 12న నిర్వహించనున్నట్లు ఎన్‌టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి(Nara bhuvaneswari help to girl students) తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన పదో తరగతి చదివే 25 మంది బాలికలకు ఉపకారవేతనాలు అందజేస్తామన్నారు. మొదటి పది ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ. అయిదు వేలు చొప్పున, తరువాతి 15 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ. మూడు వేల చొప్పున ఎన్‌టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలో ఇంటర్‌ పూర్తిచేసే వరకు ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న బాలికలు ఎన్‌టీఆర్‌ ట్రస్టు వెబ్‌సైట్‌లో (NTR trust website)డిసెంబరు ఎనిమిదో తేదీ వరకు నమోదు తమ పేరు చేసుకోవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి: AMARAVATHI PADAYATRA: 23వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర

ABOUT THE AUTHOR

...view details