ఆంధ్రప్రదేశ్

andhra pradesh

High Court: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ప్రభుత్వానికి నోటీసులు

By

Published : Jun 21, 2022, 12:01 PM IST

MOVIE TICKETS

HIGH COURT ON TICKETS: సినిమా టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వమే విక్రయించేందుకు వీలుగు.. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన సవరణ చట్టం, తదనంతరం జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ.. హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలయింది.

HIGH COURT ON TICKETS:సినిమా టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వమే విక్రయించేందుకు వీలుగు.. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన సవరణ చట్టం, తదనంతరం జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ... హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలయింది. బిగ్‌ ఎంటర్టైన్మెంట్‌ సంస్థ, దాని డిప్యూటీ జనరల్ మేనేజర్‌ సందీప్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. ప్రతివాదులుగా ఉన్న న్యాయ, శాసనశాఖ కార్యదర్శి, హోం శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్మెంట్ కార్పొరేషన్‌, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌కు నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే వ్యవహారంపై మల్టీప్లెక్స్‌ థియేటర్ల యాజమాన్యాలు గతంలో దాఖలు చేసిన వ్యాజ్యంతో కలిపి.. ప్రస్తుత వ్యాజ్యాన్ని విచారిస్తామని పేర్కొంది. ఆ రోజు విచారణలో.. మధ్యంతర ఉత్తర్వులిచ్చే అంశాన్ని పరిశీలిస్తామంది. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details