ఆంధ్రప్రదేశ్

andhra pradesh

NIMMAGADDA : "జగన్ అక్రమాస్తుల కేసు నుంచి.. నా పేరు తొలగించండి"

By

Published : Nov 25, 2021, 11:02 PM IST

NIMMAGADDA : 'జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తొలగించండి'
NIMMAGADDA : 'జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తొలగించండి' ()

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తన పేరు తొలగించాలని పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్(Nimmagadda prasad).. తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. భూసేకరణ కోసం ప్రభుత్వానికి సహకరించాలన్న ఒప్పందం మేరకు.. రైతులకు తాము నగదు చెల్లించినట్లు తెలిపారు. ఈ పిటిషన్ పై రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి.

ముఖ్యమంత్రి జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టినందుకు.. వైఎస్ సర్కారు నుంచి ఆయాచిత ప్రయోజనాలు పొందలేదని పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తన పేరు తొలగించాలని కోరుతూ.. నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు(Telangana high court) న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ విచారణ చేపట్టారు. ఉచితంగా పొందితే ప్రయోజనాలు పొందినట్లవుతుంది కానీ.. తాము వాన్ పిక్ ప్రాజెక్టు కోసం 13 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని నిమ్మగడ్డ ప్రసాద్ వివరించారు.

భూసేకరణ కోసం ప్రభుత్వానికి సహకరించాలన్న ఒప్పందం మేరకు.. రైతులకు తాము నగదు చెల్లించినట్లు తెలిపారు. రైతులకు నగదు ఇచ్చేందుకు బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేస్తే.. నిధులు మళ్లించారని సీబీఐ ఆరోపిస్తోందని నిమ్మగడ్డ వాదించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా 13వేల ఎకరాలు సేకరించడం గొప్ప విషయమని.. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే ఎక్కువగా చెల్లించామన్నారు. ప్రాజెక్టును బూట్ పద్ధతిలో నిర్వహించాలని అవగాహన ఒప్పందంలో ఎక్కడా లేదని నిమ్మగడ్డ ప్రసాద్ ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.

వాన్ పిక్ ప్రాజెక్టులపై ప్రభుత్వం కానీ.. రాక్ కానీ ఎలాంటి ఫిర్యాదూ చేయలేదన్నారు. ఈ పిటిషన్ పై రేపూ వాదనలు కొనసాగనున్నాయి.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details