ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సైబర్​ నేరగాళ్ల కొత్తరకం బెదిరింపులు... ఏం చేస్తున్నారంటే..?

By

Published : Apr 17, 2020, 8:21 PM IST

సైబర్​ నేరగాళ్లు కొత్తరకం మోసాలతో సొమ్ము కొల్లగొట్టేస్తున్నారు. మెయిల్​ హ్యక్​ అయిందని... మీ వ్యక్తిగత వీడియోలు వారి వద్ద ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత పది రోజులుగా ఇదే తరహాలో ఐదు కేసులు నమోదయ్యాయని హైదరాబాద్​ సైబర్​క్రైం పోలీసులు తెలిపారు.

సైబర్​ నేరగాళ్ల కొత్తరకం బెదిరింపులు
సైబర్​ నేరగాళ్ల కొత్తరకం బెదిరింపులు

సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసాలకు పాలుపడుతున్నారు. మీరు వాడే మెయిల్ హ్యాక్ అయిందని... మీరు చూసిన అశ్లీల వీడియోలు తమ వద్ద ఉన్నాయని బెదిరిస్తూ సొమ్ము కాజేస్తున్నారు. మీ మెయిల్ ఐడీ, పేరుతో పాటు నేరగాళ్లు ఐడీ చెబుతూ... బిట్ కాయిన్ ద్వారా మనీ పంపించాలని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ తరహా కేసు విషయమై సైబర్​క్రైం పోలీసులకు హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన ఓ మహిళా వైద్యురాలు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.

గత పది రోజులుగా ఇదే తరహాలో ఐదు కేసులు నమోదయ్యాయని... ఇలాంటి బెదిరింపులకు సంబంధించిన మెయిల్స్​ వస్తే మెయిల్​ఐడీ, పాస్వర్డ్​ మార్చుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నేరగాళ్లు సూచించిన ఖాతాల్లో ఎవ్వరూ సొమ్మును జమ చేయొద్దని వెల్లడించారు. ఇలాంటి మెయిల్​ వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ సైబర్​ క్రైం ఏసీపీ ప్రసాద్ తెలిపారు.

ఇదీ చూడండి: రాష్ట్రానికి వచ్చిన లక్ష కరోనా ర్యాపిడ్‌ టెస్టు కిట్లు

ABOUT THE AUTHOR

...view details