ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో దౌర్జన్యాలపై ఫిర్యాదుల వెల్లువ

By

Published : Feb 20, 2021, 7:51 AM IST

గతేడాది మార్చిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో దౌర్జన్యాలపై.. కలెక్టర్లు, ఇతర అధికారులకు చాలా మంది నుంచి ఫిర్యాదులు అందాయి. బలవంతపు ఏకగ్రీవాల కోసం కొన్నిచోట్ల నామినేషన్‌ పత్రాలు చించేశారని, కొన్నిచోట్ల బెదిరింపులతో ఉపసంహరించుకునేలా చేశారని.. వాపోయారు. ఎన్నికల్లో పోటీకి మరో అవకాశం ఇవ్వాలని.. కోరారు.

mptc-namination
mptc-namination

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల దౌర్జన్యాలపై ఫిర్యాదుల వెల్లువ

గతేడాది మార్చిలో దౌర్జన్యాలవల్ల నామినేషన్లు వేయలేకపోయిన వారెవరైనా.. తగిన ఆధారాలతో జిల్లా అధికారులను కలిస్తే పరిశీలిస్తామన్న ఎస్సీల ఆదేశాలతో.. కొందరు బాధితులు, ఔత్సాహికులు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా.. జగ్గంపేట, రౌతులపూడి, ప్రత్తిపాడు గొల్లప్రోలుకు చెందిన ఔత్సాహికులు.. కాకినాడలోని జడ్పీ కార్యాలయం ఎదురుగా ఆందోళన చేశారు. బలవంతపు ఏకగ్రీవాలను రద్దుచేయాలని కోరారు. గతంలో తమపై జరిగిన దౌర్జన్యాలను వివరించారు.

ఇక అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలిక నామినేషన్ల పర్వంలో.. అనేక కుట్రలు జరిగాయని మాజీ ఎంపీ జేసీ ప్రభాకర్‌రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు.. కొన్ని వీడియోలను సమర్పించారు. వైకాపా నేతలు ప్రత్యర్థుల్ని నామినేషన్లు వేయనివ్వలేదని, ధైర్యం చేసి ముందుకు వచ్చిన వాళ్ల పత్రాలు చించేశారని.. పేర్కొన్నారు. నామినేషన్ల సమయంలో.. తాను తాడిపత్రి రాకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తే చివరకు.. న్యాయవాది ద్వారా నామినేషన్‌ సమర్పించానని ప్రభాకర్‌రెడ్డి వివరించారు. ధర్మవరం పురపాలికలోనూ బెదిరింపులతో.. తెదేపా అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకున్నారని.. కలెక్టర్ గంధం చంద్రుడికి ఫిర్యాదు చేశారు.

జీవీఎంసీ ఎన్నికల్లో వైకాపా బెదిరింపులతో.. చాలా మంది నామినేషన్లు వేయలేకపోయారని తెదేపా, జనసేన సహా ఇతర నేతలు.. విశాఖ కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. మళ్లీ నామినేషన్‌ వేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక.. ప్రకాశం జిల్లా కనిగిరిలో నగర పంచాయతీ కార్యాలయానికి గేట్లు వేసి నామినేషన్లు వేయకుండా చేశారని.. అధికారులకు తెదేపా నేతలు ఫిర్యాదు అందజేశారు.

ఇదీ చదవండి:

సప్తవాహనాలపై శ్రీనివాసుడి అభయం

ABOUT THE AUTHOR

...view details