ఆంధ్రప్రదేశ్

andhra pradesh

RRR: ఆ రూమర్ నిజం కాదు.. స్పీకర్​ను కలిసి వివరణ ఇస్తా: ఎంపీ రఘురామ

By

Published : Jul 19, 2021, 5:18 PM IST

Updated : Jul 19, 2021, 5:41 PM IST

తన ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు రఘురామకృష్ణరాజు. రాజీనామా అంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తన సభ్యత్వం ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాదని ధీమా వ్యక్తం చేశారు.

mp raghu rama krishnam raju
mp raghu rama krishnam raju

కొందరు ప్రచారం చేసినట్లు ఎంపీ పదవికి తాను రాజీనామా చేయలేదని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. ఎవరెన్ని మాట్లాడినా.. లోక్​సభ సభ్యత్వం వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన సహచర వైకాపా ఎంపీలు పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై లేవనెత్తకుండా.. ఎవరో భయపెట్టినట్లు బెరుకుగా కనిపించారని వ్యాఖ్యానించారు.

ఎంపీ రఘురామ

నా లోక్​సభ సభ్యత్వం రద్దవ్వటం కలా.. నేను నిబంధనలను అతిక్రమించలేదు. నాపై మోపిన అభియోగాలన్నీ అర్థంలేనివి. లోక్​సభ​ స్పీకర్​ను కలిసి వివరణ ఇస్తాను. మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శిగారు అసహనంతో ఉన్నారనేది సుస్పష్టం. ఇవాళ సభలో ప్రధాని మోదీగారు ఉండగానే చాలా దురుసుగా మాట్లాడారు. మా సహచర ఎంపీలను బెదిరించినట్లుగా కనిపిస్తోంది.- రఘురామకృష్ణరాజు, నర్సాపురం ఎంపీ

Last Updated :Jul 19, 2021, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details