ఆంధ్రప్రదేశ్

andhra pradesh

WOMAN RETURNS: 11 ఏళ్ల క్రితం అంత్యక్రియలు..కానీ

By

Published : Aug 25, 2021, 10:48 AM IST

Updated : Aug 25, 2021, 11:29 AM IST

మానసిక స్థితి సరిగా లేని ఓ వివాహిత 11 ఏళ్ల కిందట అదృశ్యమైంది. ముగ్గురు కూతుళ్లు ఉన్న ఆమె తప్పిపోయింది. ఆ తర్వాత ఆమె కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. రెండేళ్ల తర్వాత అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం కనిపిస్తే.. ఆమె అనుకొని అంత్యక్రియలు చేశారు. కట్‌ చేస్తే ఆమె ఇప్పుడు ఇంటికి తిరిగొచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..!

missing-woman
missing-woman

తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌ గ్రామానికి చెందిన నర్సయ్య, రెంజర్ల లక్ష్మి (48)లకు ముగ్గురు కుమార్తెలు. భర్త గల్ఫ్‌లో ఉండగా, 11 ఏళ్ల కిందట లక్ష్మి అదృశ్యమైంది. అప్పటినుంచీ వెతికినా ఫలితం లేదు. రెండేళ్ల తర్వాత నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌ అటవీ ప్రాంతంలో ఓ మహిళ శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దుస్తులను చూసి లక్ష్మివేనని భావించి, కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఆచూకీ ఇలా..

ఇంటి నుంచి వెళ్లిపోయిన లక్ష్మి తమిళనాడులోని పెరంబలూర్‌ ప్రాంతానికి చేరుకుంది. అక్కడి ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసి చికిత్స చేయించింది. ఇటీవల ఆమె కోలుకుని సాధారణ స్థితికి రావడంతో ఆ సంస్థ ప్రతినిధులు వివరాలు అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఇన్నేళ్ల తర్వాత ఆమె తమిళనాడులో ఉన్నట్లు సమాచారం అందడంతో బంధువులు వెళ్లి.. లక్ష్మిని సోమవారం రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. చనిపోయిందనుకున్న ఆమె తిరిగి ఇంటికి చేరడంతో భర్త, కుమార్తెలు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ILLEGAL EARNING: తండ్రి స్థానంలో కూర్చొని.. ఏడాదిలో రూ.కోట్లు కాజేసి

Last Updated :Aug 25, 2021, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details