ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఓపీఎస్‌ అమలు చేసేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేసిన ఉద్యోగ సంఘాలు

By

Published : Aug 18, 2022, 7:44 PM IST

Updated : Aug 18, 2022, 9:29 PM IST

DISCUSSIONS FAILED ON CPS ISSUE సీపీఎస్‌పై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. చర్చలకు పిలిచిన ప్రభుత్వం పాతపాటే పాడిందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేసేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీపీఎస్ ఎంత ప్రమాదమో జీపీఎస్ అంతకంటే ప్రమాదకరమని జీపీఎస్‌ వద్దనే విషయాన్ని సంప్రదింపుల కమిటీకి తెలిపామని పేర్కొన్నాయి.

MEETING ON CPS
MEETING ON CPS

CPS ISSUE: సీపీఎస్‌పై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. చర్చలకు పిలిచిన ప్రభుత్వం పాతపాటే పాడిందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేసేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీపీఎస్‌లో వచ్చిన సవరణను అమలు చేయట్లేదని.. హామీ మేరకు ఓపీఎస్ పునరుద్ధరించాలనేదే మా డిమాండ్‌ అని తేల్చిచెప్పాయి. సెప్టెంబర్ 1న చలో విజయవాడను విజయవంతం చేయాలని కోరాయి. సీపీఎస్ ఎంత ప్రమాదమో.. జీపీఎస్ అంతకంటే ప్రమాదకరమని.. జీపీఎస్‌ వద్దనే విషయాన్ని సంప్రదింపుల కమిటీకి తెలిపామని పేర్కొన్నాయి.

ఓపీఎస్‌ తప్ప వేరే విధానానికి ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పిన ఉద్యోగ సంఘాలు

OPS: ఓపీఎస్​ తప్పా వేరే విధానానికి ఒప్పుకునేది లేదని ఈ సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు స్పష్టం చేశారు. రాజస్థాన్ విధానాన్ని ఏపీలో అమలు చేస్తారనే ఆశతో సమావేశానికి వచ్చినట్లు తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని.. ప్రభుత్వానికి ఏ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు. రాజస్థాన్‌లో ఓపీఎస్ అమలు చేస్తుంటే.. ఏపీలో అమలుకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఆర్ సూర్యనారాయణ, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వై.వి.రావు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేేతలు హాజరయ్యారు.

సీపీఎస్​పై ఉద్యోగ సంఘాలు: 2004 సెప్టెంబర్‌ 1 తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలలోని ఉద్యోగులకు నూతన పింఛను విధానం (సీపీఎస్) అమలు చేస్తోందని.. ఈ విధానం వల్ల ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత న్యాయంగా, చట్టబద్ధంగా రావాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్, కమ్యుటేషన్ దక్కట్లేదని ఏపీసీపీఎస్ యూఎస్ నేతలు సి.యం.దాస్, రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ ఉద్యోగుల జీవితాలకు ఆర్థిక, సామాజిక భద్రత లేకుండా చేసిందన్నారు. ఈ విధానం వల్ల ఒక్కో ఉద్యోగికి కోటి నుంచి కోటిన్నర రూపాయలు వస్తాయని మభ్యపెట్టారని, కానీ.. వాస్తవంలో ఒక్కో రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగికి రూ.650 నుంచి 1005 రూపాయలు పెన్షన్​గా వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పుడు ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసిన జగన్.. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానని అనేక బహిరంగ సభలలో, మీడియా ఎదుట హామీ ఇచ్చారని చెప్పారు. జగన్ మాటలు నమ్మి‌న ఉద్యోగులు సంపూర్ణ మద్దతు ప్రకటించి గెలిపించారని, కానీ.. అధికారంలోకి వచ్చిన తరువాత సీపీఎస్ ను రద్దు చేయకుండా.. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సీపీఎస్ విధానం రద్దు చేయకుండా.. గ్యారంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్) పేరుతో కొత్త విధానాన్ని తీసుకువస్తామని చెప్పడం ఉద్యోగులను మోసగించడమేనని అన్నారు. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రలలో సీపీఎస్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేస్తుంటే.. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందని ధ్వజమెత్తారు. సీఎం జగన్ చర్యలకు వ్యతిరేకంగా.. సెప్టెంబర్1న తాడేపల్లిలోని ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 18, 2022, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details