ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Telangana Minister Talasani on Movie Tickets: 'సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు'

By

Published : Dec 3, 2021, 7:21 PM IST

తెలంగాణలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు తగ్గించబోమన్న ఆయన.. ఎక్కడో ఎవరో ధరలు తగ్గించారని తాము ఆ నిర్ణయం తీసుకోమని చెప్పారు.

Minister Talasani on Movie Tickets: 'సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు'
Minister Talasani on Movie Tickets: 'సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు'

Minister Talasani on Movie Tickets: 'సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు'

Minister Talasani on Movie Tickets:సినిమా టికెట్‌ ధరలపై త్వరలోనే స్పష్టత వస్తుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు తగ్గించబోమని పేర్కొన్నారు. ఎక్కడో ఎవరో ధరలు తగ్గించారని చెబితే అందుకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, సినిమా టికెట్​ ధరలు, థియేటర్ల ఆంక్షలపై సినీ దర్శక, నిర్మాతలు మంత్రి తలసానిని కలిశారు. సంక్రాంతికి భారీ బడ్జెట్‌ సినిమాల విడుదల నేపథ్యంలో... రెండు గంటలపాటు మంత్రితో చర్చించారు. సమావేశంలో దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్​, నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, చినబాబు, యర్నేని నవీన్, ప్రమోద్, అభిషేక్ నామా పాల్గొన్నారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Minister Talasani press meet on Movie Tickets: కరోనా దృష్ట్యా థియేటర్లపై ఆంక్షలు పెడతారన్నది కేవలం అపోహేనని మంత్రి తలసాని అన్నారు. మహమ్మారి వల్ల రెండేళ్లుగా సినీ పరిశ్రమకు ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు. ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలని సూచించారు. సినిమా టికెట్ల ధరల విషయం హైకోర్టులో పెండింగ్​లో ఉందని.. ఈ అంశానికి త్వరలోనే ఫుల్​స్టాప్ పెడతామని తలసాని అన్నారు. హైదరాబాద్ వాతావరణానికి అనుగుణంగానే టికెట్ ధరలు ఉంటాయని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్​ రెండు డోసులు దాదాపు పూర్తయ్యాయని.. ఏ వైరస్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తలసాని ధీమా వ్యక్తం చేశారు.

సినిమా టికెట్ల ధరల సవరణ నిమిషాల్లో జరిగే పనికాదు. సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. గతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించాం. సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండంగా ఉంటుంది. రాష్ట్రం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో ఒమిక్రాన్‌ వస్తోంది. అప్రమత్తంగా ఉండాలని దర్శక నిర్మాతలకు చెప్పా. -తలసాని శ్రీనివాస్​ యాదవ్​, సినిమాటోగ్రఫీ మంత్రి

Minister Talasani on theatres closing:కొవిడ్ మూడో దశ ముప్పు వల్ల థియేటర్ల సామర్థ్యం 50 శాతం చేస్తారని ప్రచారం జరుగుతోందని సినీ నిర్మాత దిల్​ రాజు అన్నారు. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలున్నాయని.. సీఎం కేసీఆర్​ సూచన మేరకు పలు అంశాలను మంత్రి తలసానికి వివరించామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:PRC in Andhra Pradesh: పీఆర్‌సీ ప్రకటిస్తాం.. కానీ నివేదిక ఇవ్వలేం: కార్యదర్శుల కమిటీ

ABOUT THE AUTHOR

...view details