ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MINISTER BOTSA : 'స్వాతంత్య్ర పోరాటానికి.. అమరావతి ఉద్యమానికి పోలికేంటి'

By

Published : Nov 18, 2021, 7:23 AM IST

రాజధాని అమరావతి రైతుల ఉద్యమాన్ని హైకోర్టు... స్వాతంత్రోద్యమంతో పోల్చిందని అంటున్న వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు. న్యాయస్థానం నిజంగా అలా వ్యాఖ్యానించి ఉంటే చాలా దురదృష్టకరమనేది తన వ్యక్తిగత అభిప్రాయని అన్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ

దేశం కోసం చేసింది స్వాతంత్ర ఉద్యమమని, స్వార్థం కోసం చేస్తున్న ఉద్యమం అమరావతి ఉద్యమమని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని స్వాతంత్య్ర ఉద్యమంతో హైకోర్టు పోల్చిందని చెబుతున్న మాటలపై ఆయన స్పందించారు. కోర్టు వ్యాఖ్యలను తాను నమ్మలేకపోతున్నానని, న్యాయస్థానం అలా వ్యాఖ్యానించి ఉంటే చాలా దురదృష్టకరమని అన్నారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశారు.

అమరావతి ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ స్వార్థం కోసం చేయిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మూడు రాజధానులు ఏర్పాటుకు వైకాపా కట్టుబడి ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు... ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధికి ప్రజలిచ్చిన తీర్పుగా అభివర్ణించారు. ప్రజలు వైకాపా ప్రభుత్వ పనితీరుకు నూటికి 97-98 శాతం మార్కులు వేశారని, రాష్ట్రంలో 97-98 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో ఒకటి రెండు చోట్ల పార్టీ ఓడిందని... ఓటమికి గల కారణాలను సమీక్షించుకుని సరిదిద్దుకుంటామని మంత్రి బొత్స వివరించారు.

ఇదీచదవండి.

Recruitment in Medical Department: వైద్యారోగ్యశాఖలో 11,425 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ABOUT THE AUTHOR

...view details