ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MEDICINE FROM SKY: దేశంలో తొలిసారి డ్రోన్ల ద్వారా మెడిసిన్.. తెలంగాణ​ నుంచి శ్రీకారం

By

Published : Sep 11, 2021, 4:22 AM IST

రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసే.... మెడిసిన్ ఫ్రం స్కై (MEDICINE FROM SKY) ప్రాజెక్టు తెలంగాణలో ఇవాళ ప్రారంభం కానుంది. వికారాబాద్​లోని పోలీస్ పరేడ్ మైదానం(VIKARABAD POLICE PARADE GROUND) లో.. నెలరోజులపాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రయోగాత్మక పరిశీలన జరగనుంది. కేంద్ర విమానయానశాఖ(Ministry of Civil Aviation)మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, మంత్రులు కేటీఆర్(KTR), సబితాఇంద్రారెడ్డి(SABITHA INDRAREDDY) లాంఛనంగా ప్రారంభించనున్నారు.

MEDICINE FROM SKY
MEDICINE FROM SKY

రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ఆధ్వర్యంలో.. మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ ఆర్థిక వేదిక, నీతి ఆయోగ్, హెల్త్​నెట్ గ్లోబల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో.. ఐటీశాఖ జట్టు కట్టింది. ఈ సంస్థల భాగస్వామ్యంతో డ్రోన్ ఫ్లైట్ల(DRONE FLIGHTS) ద్వారా అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు ఔషధాలు సరఫరా చేయటం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. వికారాబాద్​లో ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు కేంద్రం అనుమతులు పూర్తయ్యాయి. మారుట్ డ్రోన్స్, బ్లూ డార్ట్, స్కై ఎయిర్, టెక్ ఈగిల్ సంస్థలు రెండ్రోజులుగా అవసరమైన ఏర్పాట్లు, ట్రయల్ రన్స్ పూర్తి చేసుకున్నాయి. మొదటి రోజు ట్రయల్ రన్​లో భాగంగా... విజువల్ లైన్​కు ఇవతలివైపు 400 మీటర్ల ఎత్తు వరకు ఔషధాల బాక్సును ఈ సంస్థల డ్రోన్లు తీసుకెళ్లాయి.

డ్రోన్లు ఎంత కెపాసిటీ పేలోడ్స్​ను తీసుకెళ్తాయి, ఎంత దూరం వెళ్తాయనే అంశాలను నెలరోజుల ప్రయోగాత్మక పరిశీలనలో గుర్తిస్తారు. ఎక్కువ దూరం, బరువైన పేలోడ్స్ తీసుకెళ్లేందుకు ఎలాంటి చర్యలు అవసరమనే అంశాలపై పరిశీలన కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టు సఫలమైతే విజువల్​లైన్​కు ఆవతల వైపు... డ్రోన్ల ద్వారా మందుల సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించనుంది. ఈ ప్రాజెక్టు విజయం ద్వారా ఎమర్జింగ్ రంగాల్లో పనిచేస్తోన్న విదేశీ కంపెనీలు.... హైదరాబాద్​లో తమ కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు ఊతం లభిస్తుంది.

ఇవీ చూడండి:

AP WEATHER REPORT: బంగాళాఖాతంలో అల్పపీడనం... 4 రోజుల పాటు భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details