ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెరాసలోకి రావాలని సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు: తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ

By

Published : Jul 9, 2021, 3:48 AM IST

హైదరాబాద్​లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో తెతెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ చర్చలు ముగిశాయి. తెరాసలోకి రావాలని కేసీఆర్‌ ఆహ్వానించారని రమణ చెప్పారు. అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ
తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటి అనంతరం మాట్లాడిన ఎల్.రమణ

పార్టీ మారడంపై అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ అన్నారు.ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో కలిసి.. మంత్రి ఎర్రబెల్లి, ఎల్‌.రమణ సుదీర్ఘంగా చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగిందని రమణ తెలిపారు. తెరాసలోకి రావాలని కేసీఆర్‌ ఆహ్వానించారని వెల్లడించారు. సామాజిక తెలంగాణ కోసం కలిసి ముందుకు వెళ్దామని అన్నారని తెలిపారు.

'సీఎం కేసీఆర్​ను కలిశాను. తెలంగాణ రాష్ట్ర సాధన, రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలపై గంటన్నరపాటు చర్చించాం. కేసీఆర్​ నాయకత్వంలో తెలంగాణలో జరుగున్న అభివృద్ధిపై కూడా మాట్లాడుకున్నాం. అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలని సీఎం అన్నారు.

-ఎల్​.రమణ, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

ఎల్‌.రమణ అంటే కేసీఆర్‌కు అభిమానమని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన రమణ తెరాసకు అవసరమన్నారు. ఆయనను తెరాసలోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించారని తెలిపారు. రమణ సానుకూలంగా స్పందించారన్నారు.

ఆవిర్భావం నుంచి తెదేపాలోనే

రమణ తెలుగుదేశం సీనియర్‌ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నారు. 1994లో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి, 1996లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత పలు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆయన 2009 శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల నుంచి విజయం సాధించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెతెదేపా అధ్యక్షునిగా రమణ కొనసాగుతున్నారు.

ఇదీ చదవండి:

AOB Villagers: 'మమ్మల్ని గుర్తించండి.. దయచేసి ఆంధ్రప్రదేశ్​లో కలిపేయండి'

కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా

ABOUT THE AUTHOR

...view details