ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హైదరాబాద్‌ సిగలో మరో అద్భుతం... పొడవైన సోలార్‌ బై సైకిల్‌ ట్రాక్‌

By

Published : Sep 5, 2022, 7:20 PM IST

Bicycle track along ORR: హైదరాబాద్‌ మహానగరం మరో అద్భుతానికి వేదిక కానుంది. మహానగర వడ్డానం ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ బై సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు అవసరమైన కార్యచరణ, ప్రణాళికను పట్టాభివృద్ధి శాఖ సిద్ధం చేయగా...మంత్రి కేటీఆర్‌(KTR)రేపు శంకుస్థాపన చేయనున్నారు.

సోలార్‌ బై సైకిల్‌ ట్రాక్‌
సోలార్‌ బై సైకిల్‌ ట్రాక్‌

Bicycle track along ORR: మహానగరంగా విస్తరించిన హైదరాబాద్‌ నగరంలో రవాణాకు మరో నూతన మార్గం అందుబాటులోకి రానుంది. రేపు ఔటర్ రింగ్ రోడ్డు వెంట(ORR) వరల్డ్ క్లాస్ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ORR వెంట తొలి విడతగా 23 కిలో మీటర్ల మేర 4.5 మీటర్ల వెడల్పుతో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్మించనున్నారు. మొదటి దశ కింద ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి నానక్ రామ్‌గూడ నుంచి కొల్లూరు వరకు సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణం చేస్తారు. ఈ సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌ నుంచి 16మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు.

రాత్రి సమయంలో కనువిందు చేస్తోన్న సైకిల్‌ ట్రాక్‌

సైకిల్‌పై సవారీ చేయలకునే వారి కల 2023 వేసవి నాటికి తీరుతుందని మంత్రి కేటీఆర్ హామీ ఇస్తున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్‌ కూడా చేశారు. ట్రాక్‌ వెంట భద్రత కోసం 24/7 పనిచేసే CCTVలను కూడా అమర్చనున్నారు. ఈ CCTVలను కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేసి భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఐటీ నిపుణులను దృష్టి ఉంచుకుని తొలి దశ నిర్మాణాన్ని చేపడుతున్నారు.

చూడముచ్చటగా ఉన్న సైకిల్‌ ట్రాక్‌

దేశంలోనే ఐటీ రంగానికి కీలక స్థానంగా ఉన్న హైదరాబాద్‌లో ఇలాంటి వినూత్న ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికి హైదరాబాద్ నగరం మినీ ఇండియాలాగా ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారే కాకుండా, విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ ఎంతో సౌకర్యంగా, ప్రశాంతంగా జీవనం గడుపుతారు. అందుకే వివిధ రంగాల్లో నిపుణులు హైదరాబాదులో ఉద్యోగం, వ్యాపారం చేయడానికి, ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇలాంటి సహజ సిద్ధమైన అనుకూలతలతో పాటు మౌలిక వసతులు కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.

చీకటి వేళలో కాంతుల నడుమ అందంగా ఉన్న సైకిల్ ట్రాక్

తొలి దశ నిర్మాణాన్ని 2023 వేసవి నాటికి అందుబాటులోకి తెచ్చి అటు తర్వాత మొత్తం ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ సైకిల్‌ ట్రాక్‌ విత్‌ సోలార్‌ రూఫ్‌ టాఫ్‌ చేయాలని పట్టాభివృద్ధి శాఖ నిర్ణయించింది. తొలి దశ సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణం చేపట్టడం ద్వారా హైదరాబాద్‌ మహానగర ప్రతిష్ఠ మరింత ఇనుమడించనుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details