ఇంటర్మీడియట్ మొదటి, రెండు సంవత్సరాల అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను శనివారం సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ ఏడాది మొదటిసారిగా ప్రయోగాత్మకంగా వృత్తి విద్య, కొన్ని మైనర్ సబ్జెక్టులను ఆన్‌లైన్(ఆన్ స్క్రీన్)లో మూల్యాంకనం చేశారు.
ఈ నెల 26 నుంచి నవంబరు 2 వరకు సమాధాన పత్రాల పునఃలెక్కింపు, పరిశీలనకు అవకాశం కల్పించారు. పునఃలెక్కింపునకు పేపర్‌కు రూ.260, స్కాన్‌కాపీ, పునఃపరిశీలనకు పేపర్‌కు రూ.1,300 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్కానింగ్ జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లోనే అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ఏడాది పరీక్షలకు జనరల్, వృత్తి విద్య విద్యార్థులు 3,24,800 మంది, రెండో ఏడాది పరీక్షలకు సాధారణ, వృత్తి విద్య కలిపి 14,950 మంది హాజరయ్యారు.