ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Cyclone Gulab Effect on Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం.. స్పెషల్ కంట్రోల్‌ రూమ్‌

By

Published : Sep 27, 2021, 10:05 AM IST

తెలంగాణపై గులాబ్ తుపాను(Cyclone Gulab Effect on Hyderabad) పంజా విసురుతోంది. దీని ప్రభావం(Cyclone Gulab Effect on Hyderabad)తో హైదరాబాద్​లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.

Cyclone Gulab Effect on Hyderabad
Cyclone Gulab Effect on Hyderabad

తెలంగాణపై గులాబ్ తుపాను(Cyclone Gulab Effect on Hyderabad) పంజా విసురుతోంది. దీని ప్రభావం(Cyclone Gulab Effect on Hyderabad)తో హైదరాబాద్​లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వాన నగర ప్రజలను భయపెడుతోంది. జీడిమెట్ల, కొంపల్లి, అంబర్​పేట్, కాచిగూడ, గోల్నాక, నల్లకుంట, ఉప్పల్, రామంతపూర్, పీర్జాదిగూడ, బోడుప్పల్, మేడిపల్లి, ఎల్బీనగర్​, వనస్థలిపురం, హయత్​నగర్, కూకట్​పల్లి, కేపీహెచ్​బీ కాలనీ, హైదర్​నగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతినగర్​, నిజాంపేట్, బాచుపల్లిలో ఏకధాటి వాన పడుతోంది.

భారీ వర్షాల దృష్ట్యా అధికారులు హైదరాబాద్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఇద్దరు అధికారులతో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి.. వరదలో చిక్కుకున్న వారు కంట్రోల్ రూం నంబర్ 040 23202813 కి కాల్ చేయాలని సూచించారు.

గడిచిన 6 గంటల్లో గులాబ్ తుపాను(Cyclone Gulab Effect on Hyderabad) వాయుగుండంగా బలహీనపడింది. గులాబ్‌ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీని ప్రభావంతో రానున్న మూడ్రోజులు హైదరాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్​లో నేడు, రేపు హైఅలర్ట్ ప్రకటించారు. విపత్తు విభాగం జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, హెచ్‌వోడీలు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. బాధితులు ఎవరైనా ఫోన్‌ చేస్తే వెంటనే స్పందించాలని విపత్తు విభాగానికి జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details