ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గోదావరికి మళ్లీ వరద.. అధికారులను అప్రమత్తం చేయాలని కేసీఆర్​ ఆదేశం

By

Published : Sep 12, 2022, 1:58 PM IST

Flood levels increased in Godavari: గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉప నదులు, వాగులు పొంగుతుండటంతో గోదావరిలో క్రమేపీ నీటిమట్టం పెరుగుతోంది. జూలైలో గోదావరి ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. తాజాగా తిరిగి ప్రవాహం పెరుగుతోంది. మరోవైపు కృష్టానదిలోనూ వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది.

Flood levels increased in Godavari:
గోదావరికి మళ్లీ వరద

Flood levels increased in Godavari: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ఉప నదులు, వాగులు పొంగుతుండటంతో గోదావరిలో క్రమేపీ నీటిమట్టం పెరుగుతోంది. జులై నెలలో గోదావరి ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. తాజాగా తిరిగి ప్రవాహం పెరుగుతోంది. ఆదివారం శ్రీరామసాగర్‌కు ఎగువ నుంచి వరద రాక క్రమంగా పెరిగింది. శనివారం 71 వేల క్యూసెక్కుల వరద రాగా.. 24 గంటల్లో 1.75 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ఆదివారం ఉదయం సమయంలో రెండు లక్షల క్యూసెక్కుల విడుదల ఉండగా సాయంత్రానికి 1.57 లక్షల క్యూసెక్కులు నమోదయింది. మానేరు, ప్రాణహిత, ఇతర ప్రవాహాలు కలిపి లక్ష్మీ(మేడిగడ్డ) వద్ద వరద పెరుగుతోంది. బ్యారేజీ 70 గేట్లు ఎత్తి దిగువకు 5.05 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సమ్మక్క సాగర్‌ దిగువన కూడా నదిలో ప్రవాహం పెరుగుతోంది.

భద్రాద్రి జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద ఆరు గంటల సమయంలో నదిలో 37.19 అడుగుల మట్టం నమోదయింది. ఉదయం 9 గంటలకు 33.94 అడుగులు ఉండగా సాయంత్రానికి దాదాపు నాలుగు అడుగుల మేర మట్టం పెరిగింది. మరోవైపు కృష్ణా నదిలో ఆలమట్టి, నారాయణపూర్‌ల నుంచి వరద దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం ఆరు గేట్లు, నాగార్జునసాగర్‌ పది గేట్ల ద్వారా విడుదల కొనసాగుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రాత్రి 8 గంటలకు ఎగువన ఉన్న కడెం, శ్రీరామ సాగర్‌(ఎస్సారెస్పీ)లతో పాటు పరీవాహక ప్రాంతాల నుంచి 5.55 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 40 గేట్లు ఎత్తి 5.54 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. గోదావరి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ 9 లక్షల క్యూసెక్కులను దాటుతున్న పరిస్థితుల నేపథ్యంలో.. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులను సన్నద్ధంగా ఉంచాలని చెప్పారు. అందుకు సంబంధించి తక్షణమే సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి... ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

నిండుకుండలా స్వర్ణ జలాశయం.. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్‌ స్వర్ణ జలాశయం నిండు కుండలా మారింది. ఎగువనున్నమహారాష్ట్ర నుంచి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండింది. ఇన్ ఫ్లో 25 వేల క్యూసెక్కులుగా ఉండటంతో అధికారులు 3గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. స్వర్ణ వాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రాజెక్టుల్లో నిల్వ, ప్రవాహ వివరాలు..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details