ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Revanth Reddy: 'అవినీతి ఆరోపణలు ఉన్న వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ ఎలా ఇస్తారు'

By

Published : Nov 16, 2021, 7:58 PM IST

సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిపై (Venkatrami Reddy) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) మండిపడ్డారు. వెంకట్రామిరెడ్డి భూ అక్రమాలకు సహకరించారని ఆరోపించారు. కోకాపేట భూ గోల్‌మాల్‌లోనూ ఆయన హస్తం ఉందన్నారు.

1
1

రేవంత్ రెడ్డి

సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి (Venkatrami Reddy) భూ అక్రమాలకు సహకరించారని తెలంగాణ పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ఆయన 2017లో దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అధికారిగా పని చేశారని.. ఆ సమయంలో 5 వేల ఎకరాలు ఎవరికి బదిలీ చేశారని ప్రశ్నించారు. 5 వేల ఎకరాల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచట్లేదన్నారు. వెంకట్రామిరెడ్డి దుబ్బాక ఎన్నికల్లో తెరాసకు సహకరించారని విమర్శించారు. గాంధీ భవన్​లో మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ప్రాజెక్టుల భూసేకరణలో నిర్వాసితులను వెంకట్రామిరెడ్డి (Venkatrami Reddy) బెదిరించారని రేవంత్​ రెడ్డి (Revanth Reddy) అన్నారు. మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఆయన వైఖరిపై కాంగ్రెస్‌ పలుమార్లు ఫిర్యాదులు చేసిందని వెల్లడించారు. వెంకట్రామిరెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్రాన్ని డీవోపీటీ వివరణ కోరిందని చెప్పారు. కేంద్రం లేఖను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు.

కోకాపేట భూముల వేలంలో రూ.వెయ్యి కోట్లు చేతులు మారాయని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. కోకాపేట భూముల వేలంలో వెంకట్రామిరెడ్డి (Venkatrami Reddy) కుటుంబానికి చెందిన రాజ్‌పుష్ప అనే సంస్థ పాల్గొందన్నారు. రాజ్‌ పుష్ప సంస్థ కోకాపేట భూములు దక్కించుకుందని వెల్లడించారు. ఇలా అనేక అవినీతి ఆరోపణలు ఉన్న వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ ఎలా ఇస్తారని సీఎం కేసీఆర్​ను రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

ఇదీ చదవండి :

Amaravati Cases: అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీకి రాజధాని: హైకోర్టు సీజే

ABOUT THE AUTHOR

...view details