ఆంధ్రప్రదేశ్

andhra pradesh

High Court: "బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు.. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం"

By

Published : Aug 31, 2022, 9:31 AM IST

High Court
హైకోర్టు

High Court on idols installation in public places: పల్నాడు జిల్లా నరసరావుపేటలో అనధికారికంగా వైఎస్‌ఆర్‌ విగ్రహం ఏర్పాటు చేశారంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. అనధికారికంగా విగ్రహాల ఏర్పాటు సుప్రీం తీర్పు, జీవో 18కి విరుద్ధమని తెలిపిన హైకోర్టు సత్వరమే తగిన చర్యల తీసుకోవాలని కలెక్టర్, మున్సిపల్ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.

High Court on idols installation in public places: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని మయూరి కూడలిలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటును అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. బహిరంగ ప్రదేశాలు, రహదారుల్లో విగ్రహాలు నెలకొల్పడం సుప్రీంకోర్టు తీర్పునకు, 2013 ఫిబ్రవరి 18న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 18కి విరుద్ధమని పేర్కొంది. వైఎస్‌ విగ్రహం ఏర్పాటులోనూ ఈ రెండు ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. పల్నాడు జిల్లా కలెక్టర్‌కు కూడా తగిన ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంటూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ మంగళవారం ఆదేశాలిచ్చారు. నరసరావుపేటలో వైఎస్‌ విగ్రహం ఏర్పాటుకు అధికారులు అనుమతి ఇవ్వడాన్ని సవాలుచేస్తూ గూడూరు శేఖర్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details