ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బందరు పోర్టు ఒప్పందం రద్దుపై మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరణ

By

Published : Oct 2, 2019, 5:18 AM IST

బందరు పోర్టు ఒప్పందం రద్దుపై... దాఖలైన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని... ఇంధన, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి, పోర్టుల డైరెక్టర్, మచిలీపట్నం తహశీల్దార్‌ను ధర్మాసనం ఆదేశించింది.

high court on bandar port

బందరు పోర్టు ఒప్పందం రద్దుపై... దాఖలైన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. పోర్టు నిర్మాణ వ్యవహారంలో టెండర్ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని, బిడ్‌ను ఖరారు చేయెుద్దని ప్రభుత్వానికి న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రమాణపత్రాలు దాఖలు చేశాక పూర్తి స్థాయిలో వాదనలు వింటామని పేర్కొంది. విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. మచిలీపట్నం పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 8న జారీచేసిన జీవో 66ను సవాలు చేస్తూ... నవయుగ మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఒప్పందం రద్దు జీవో నిలుపుదలతో పాటు ప్రాజెక్ట్ పనుల్ని ఇతరులకు అప్పగించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి... మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై నిర్ణయాన్ని వాయిదా వేశారు.
ఇదీ చదవండి:బందరు పోర్టుపై హైకోర్టును ఆశ్రయించిన నవయుగ

Intro:41


Body:41


Conclusion:శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల మూడోరోజు శ్రీ భ్రమరాంబ దేవి భక్తులకు చంద్రఘంట అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రావణ వాహనంపై కొలువుదీర్చి అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కళాకారుల సందడి నడుమ శ్రీ స్వామి అమ్మవార్లను శ్రీగిరి పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలంకరణ, విద్యుద్దీపాల అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details