ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Rains in hyderabad: హైదరాబాద్​లో భారీ వర్షం... అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

By

Published : Sep 25, 2021, 9:02 PM IST

హైదరాబాద్​లో భారీ వర్షం

ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్​లో భారీ వర్షం కురుస్తోంది. నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్‌పేట్‌, కాచిగూడ, గోల్నాక, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, లక్డీకపూల్‌, కోఠి, అబిడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీ, హైదర్‌నగర్‌, ప్రగతినగర్‌, నిజాంపేట, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాధిగూడ, మేడిపల్లి, జీడిమెట్ల, బాలానగర్, దుండిగల్, కుత్బుల్లాపూర్‌లో భారీ వర్షం కురిసింది. వర్షపు నీరు రహదారులపైకి చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

హైదరాబాద్‌లో రాత్రి 9 గంటల వరకు వర్షం కురిసే అవకాశముందని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. నగర వాసులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. సాయం కోసం 040-29555500 నంబర్​ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీచదవండి.

LOW PRESSURE : బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం... తుపానుగా మారే అవకాశం

ABOUT THE AUTHOR

...view details