ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

By

Published : May 24, 2021, 4:17 PM IST

బంగాళఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపాన్​గా మారిందని అమరావతి వాతావరణ సంచాలకురాలు స్టెల్లా తెలిపారు. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.

తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

తూర్పు మధ్య బంగాళఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపానుగా మారిందని అమరావతి వాతావరణ సంచాలకురాలు స్టెల్లా తెలిపారు. ఈ తుపాను రాబోయే 12గంటల్లో తీవ్ర తుపానుగా మారుతోందన్నారు. ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఈనెల 26న పారాదీప్, సాగర్ దీవి వద్ద తీరం దాటనుందన్నారు.

తుపాను ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి సముద్రం అలజడి ఉంటుందని వెల్లడించారు. లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:

బ్లాక్​ ఫంగస్ అధ్యయనానికి నిపుణుల కమిటీ

ABOUT THE AUTHOR

...view details