ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వినాయక నిమజ్జనం.. చిందులేసిన అనంతపురం ఎస్పీ

By

Published : Sep 3, 2022, 10:21 AM IST

Vinayaka immersion: రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం ఘనంగా సాగింది. యువతి, యవకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పులు, నృత్యాలు, డీజేలోతో సందడిగా ఊరేగింపులు నిర్వహించారు. తాడిపత్రిలో అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప తీన్మార్ డ్యాన్స్‌ చేశారు. కర్నూలులో బాణసంచ సందడి ఆకట్టకుంది.

Grand vinayaka immersion
వినాయక నిమజ్జనం

Vinayaka immersion: రాష్ట్రంలోని పలు చోట్ల వినాయక నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నంద్యాలలోని అబ్బిరెడ్డిపల్లి చెరువులో గణేశుణ్ని నిమజ్జనం చేశారు. యువకుల నృత్యాలు... వేషధారణ వీక్షకులను ఆకట్టుకున్నాయి. వైఎస్సార్​ జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 విగ్రహాలను నిమజ్జనం చేశారు. కడప చెరువు, సిద్ధవటం పెన్నా నది...కేసీ కెనాల్‌... చెన్నూరు పెన్నా నదిలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో గణేశ్‌ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప... ప్రజలతో కలిసి చిందులేశారు.

కల్యాణదుర్గంలో వినాయక నిమజ్జనం ఉల్లాసంగా జరిగింది. లంబోధరుడుని వీధి వీధిలో ఊరేగిస్తూ పట్టణ శివారులోని ఓకుంట చెరువులో నిమజ్జనం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినాయక నిమజ్జనం వైభవంగా జరిగింది. మండపాల నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి తుంగభద్రలో కలిపారు. ఈ సందర్భంగా కాల్చిన బాణసంచా అందరిని అకట్టకుంది. నెల్లూరులో గణేశ్‌ నిమజ్జనం పెద్దఎత్తున నిర్వహించారు. ఊరేగింపులో ఆనం సోదరుడు ట్రాక్టర్ నడిపారు. డీజే, వాయిద్యాలు, డప్పులు, సాంస్క్రతిక కార్యక్రమాల మధ్య ఊరేగింపు జరిగింది.

వినాయక నిమజ్జనం

ఘర్షణ: రాష్ట్రంలోని ప్రతి చిన్న విషయంపై అధికార - ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదాలు చూస్తునే ఉన్నాం. వినాయక నిమజ్జనం సమయంలోనూ ఈ ఘర్షణలు వదలలేదు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఇరు పార్టీలకు చెందిన వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారు. ఎదురుపడిన ఇరువర్గాలు ఒకరినోకరు దూషించుకుని... మాటా మాటా పేరిగి రాళ్లు రువ్వుకున్నారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగోట్టారు. ఈ క్రమంలో పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details