ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అవసరమైతే ప్రభుత్వమే బందరు పోర్టు నిర్మిస్తుంది'

By

Published : Aug 3, 2019, 6:20 PM IST

బందరు పోర్టు నిర్మాణంపై తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి పేర్ని నాని ఖండించారు. తెలంగాణకు పోర్టును అప్పగిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

'అవసరమైతే ప్రభుత్వమే బందరు పోర్టు నిర్మిస్తోంది'

'అవసరమైతే ప్రభుత్వమే బందరు పోర్టు నిర్మిస్తోంది'

మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెదేపా హయంలో పోర్టులో జరిగిన పనలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ హడావిడిగా పోర్టు నిర్మాణానికి శ్రీకారుం చుట్టారని ఆరోపించారు. బందరు పోర్టు తెలంగాణకు కట్టబెడుతున్నారంటూ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని స్పష్టం చేశారు. ఆర్టీ 62 జీవోని రహస్య జీవో అంటూ తెదేపా నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పోర్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంస్థ వెనకడగు వేస్తే.. రాష్ట్ర ప్రభుత్వమే బందరు పోర్టును పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు.

భాజపా నేతగా మాట్లాడారు..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఐదేళ్లలో రూ. 2300 కోట్ల అవినీతి జరిగిందని మంత్రి తెలిపారు. నిపుణుల కమిటీ ఆధారంగా ప్రభుత్వం విచారణ చేస్తోందని అన్నారు. గజేంద్రసింగ్ షెకావత్‌ కేంద్ర జలవనరులశాఖ మంత్రిగా కాకుండా భాజపా నేతగా పార్లమెంటులో మాట్లాడారని విమర్శించారు. వైకాపాకు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదగాలనే రాజకీయ ఆకాంక్ష ఆయన మాటల్లో కనిపించిందని అన్నారు. పీపీఏల విషయంలో అవినీతి ప్రక్షాళన చేస్తున్న జగన్‌ను మెచ్చుకోకుండా విమర్శలు చేయటం సరికాదన్నారు.

Intro:అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని వరలక్ష్మి సినిమా థియేటర్ సమీపంలో భవన నిర్మాణ పనులు చేస్తున్న మేస్త్రి ఆంజనేయులు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు భవన నిర్మాణానికి ఇనుప కడ్డీలు కడుతుండగా సమీపంలో ఉన్న కరెంటు తీగలను ఇనుప చువ్వలు తగిలాయి విద్యుత్ ఘాతానికి గురైన ఆంజనేయులు అక్కడికక్కడే మృతిచెందాడు అనంతపురం గ్రామీణ మండలం కృష్ణమరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు మేస్త్రీగా పని చేస్తున్నాడు కూలీలతో పాటు పనిచేస్తూ విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందడంతో విషాదం నెలకొంది ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు


Body:కరెంట్ షాక్


Conclusion:అనంతపురం జిల్లా

TAGGED:

ABOUT THE AUTHOR

...view details