ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.13.6 లక్షల విలువైన బంగారం పట్టివేత

By

Published : Apr 14, 2021, 12:00 PM IST

హైదరాబాద్​ శివారులోని శంషాబాద్ విమానాశ్రయంలో సూట్​కేసు ఫ్రేములో తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ పట్టుకున్నారు. దాని విలువ 13.6 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Gold worth Rs 13.6 lakh seized at Shamshabad airport hyderabad
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

హైదరాబాద్​ శివారులోని శంషాబాద్ విమానాశ్రయంలో 381 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. సూట్‌కేస్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్రేమ్‌లో పసిడిని గుర్తించారు.

దీని విలువ రూ.13.6 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికుడిపై బంగారం అక్రమ రవాణా కేసు నమోదు చేశారు.

సూట్‌కేస్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్రేమ్‌లో బంగారం

ఇవీచూడండి:పంచలింగాల చెక్‌పోస్టు వద్ద రూ.1.04 కోట్ల బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details