ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nayeem: గ్యాంగ్​స్టర్​ నయీం బినామీల ఆస్తులు జప్తు

By

Published : Mar 29, 2022, 10:27 AM IST

గ్యాంగ్​స్టర్​ నయీం బినామీల ఆస్తులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే సుమారు రూ.150 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పలు ఆస్తులను విక్రయించేందుకు నయీం భార్య పహీమ్ బేగం, అనుచరులు పాశం శ్రీను, అబ్దుల్ ఫహీమ్, నజీర్​లు ప్రయత్నించడంతో రాచకొండ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

Nayeem
Nayeem

గ్యాంగ్​ స్టర్ నయీంకు సంబంధించిన బినామీ ఆస్తులను ఆదాయపు పన్ను అధికారులు జప్తు చేశారు. బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి ఉన్న 10 ఆస్తులను అధికారులు జప్తు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నయీం బినామీల పేరు మీద ఉన్న వ్యాపార దుకాణాలు, వ్యవసాయ భూములు ఇందులో ఉన్నాయి. నయీం​కు సంబంధించిన మొత్తం 45 ఆస్తులను అధికారులు ఇప్పటికే తాత్కాలికంగా జప్తు చేశారు. వాటి విలువ సుమారు రూ.150 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆయా ఆస్తులకు సంబంధించి ఇప్పటికే కొందరు బినామీలకు అధికారులు నోటీసులు జారీచేశారు. ఆస్తులను ఎలా కూడబెట్టారనే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోవడం వల్ల అందులోని 10 ఆస్తులను మాత్రం పూర్తిగా జప్తు చేశారు.

2016 ఆగస్టు 8న షాద్​నగర్ వద్ద జరిగిన ఎన్​కౌంటర్​లో నయూం మృతిచెందాడు. అనంతరం నార్సింగిలోని నయీం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేసిన సందర్భంగా భారీగా ఆస్తులు బయటపడ్డాయి. నయీం ఎన్​కౌంటర్ కేసును ప్రభుత్వం... సిట్​కు అప్పగించింది. దర్యాప్తులో అతని బినామీల పేరు మీద ఉన్న ఆస్తులను సిట్ గుర్తించింది. పలువురు బాధితులు సైతం నయీం తమ ఆస్తులను లాక్కున్నట్లు ఫిర్యాదు చేశారు. నయీం బినామీల పేరు మీద ఉన్న ఆస్తుల పత్రాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్​) కోర్టులోనూ సమర్పించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పలు ఆస్తులను విక్రయించేందుకు నయీం భార్య పహీమ్ బేగం, అనుచరులు పాశం శ్రీను, అబ్దుల్ ఫహీమ్, నజీర్​లు ప్రయత్నించడంతో రాచకొండ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మిగతా ఆస్తులకు సంబంధించిన దర్యాప్తు ప్రక్రియను ఐటీ అధికారులు కొనసాగిస్తున్నారు.

ఇదీచూడండి

ABOUT THE AUTHOR

...view details