ఆంధ్రప్రదేశ్

andhra pradesh

RS PRAVEEN KUMAR: నల్గొండలో అట్టహాసంగా రాజ్యాధికార సంకల్ప సభ

By

Published : Aug 8, 2021, 9:47 PM IST

స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఐపీఎస్​ అధికారి ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​.. తెలంగాణలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. బహుజన సమాజ్​ పార్టీ (బీఎస్పీ) కండువా వేసుకున్నారు. తెలంగాణలోని నల్గొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన 'రాజ్యాధికార సంకల్ప సభ'లో బీఎస్పీలో చేరారు.

రాజ్యాధికార సంకల్ప సభ
రాజ్యాధికార సంకల్ప సభ

తెలంగాణలోని నల్గొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో విశ్రాంత ఐపీఎస్ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ 'రాజ్యాధికార సంకల్ప సభ' జరిగింది. ఈ సభకు బీఎస్పీ శ్రేణులు, స్వేరోస్‌ ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీలో చేరారు. తెలంగాణలో గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్‌.. ఇటీవల స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు.

మర్రిగూడ బైపాస్‌ నుంచి సభా వేదిక వరకు ప్రవీణ్‌కుమార్‌.. ర్యాలీగా వచ్చారు. మర్రిగూడ బైపాస్‌ వద్ద అంబేడ్కర్‌, జగ్జీవన్‌ విగ్రహాలకు నివాళులు అర్పించారు. మహిళల కోలాటాలు, డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details