ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Padayatra: 15వ రోజు మహా పాదయాత్ర... స్వాగతం పలికిన ఏలూరు

By

Published : Sep 26, 2022, 1:15 PM IST

Amaravati Farmers Padayatra: అమరావతి రైతుల 15వ రోజు మహా పాదయాత్ర.. ఏలూరు జిల్లాలో ప్రారంభమైంది. పెదపాడు మీదుగా ఏలూరు సమీపంలోని కొత్తూరు వరకు పాదయాత్ర చేయనున్నారు. కడిమిగుంటలో రైతులకు పూలతో గ్రామస్థులు స్వాగతం పలికారు.

Amaravati farmers maha Padayatra
పాదయాత్ర

Amaravati Farmers Padayatra: అమరావతి రైతుల మహా పాదయాత్ర 15వ రోజుకు చేరింది. ఇవాళ ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొనికి నుంచి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రకు ముందు రైతులు రథానికి ప్రత్యేక పూజలు చేశారు. పెదపాడు మీదుగా ఏలూరు సమీపంలోని కొత్తూరు వరకు పాదయాత్ర సాగనుంది. పాదయాత్రలో నిమ్మల రామానాయుడు, మాగంటి బాబు, రామరాజు, గన్ని వీరాంజనేయులు, బడేటి చంటి, జవహర్‌ పాల్గొన్నారు. పెదపాడు మీదుగా ఏలూరు సమీపంలోని కొత్తూరు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఇవాళ సుమారు 15 కిలో మీటర్లు రైతుల పాదయాత్ర సాగనుంది.

రైతుల పాదయాత్రకు చింతమనేని ప్రభాకర్, కడిమిగుంట గ్రామస్థులు... పూలతో స్వాగతం పలికారు. రైతుల మహా పాదయాత్రకు ఏలూరు వైద్యుల సంఘీభావం తెలిపారు. పాదయాత్ర రథానికి సకలకొత్తపల్లి గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా రైతులకు రోజా పూలు అందించి స్వాగతం పలికారు.

పాదయాత్ర

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details