ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Land acquisition units: 29 భూసేకరణ యూనిట్ల గడువు పొడిగింపు

By

Published : May 13, 2022, 7:55 AM IST

Extension of expiration of land acquisition units

Extension of expiration of land acquisition units: రాష్ట్రంలోని వివిధ జల వనరుల ప్రాజెక్టులకు సంబంధించిన 29 భూసేకరణ యూనిట్ల గడువును.. 2023 డిసెంబరు 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, సహాయ పునరావాస పనుల నిమిత్తం ఇప్పుడు కొత్తగా 6 యూనిట్లు ఏర్పాటు చేయనుంది.

Extension of expiration of land acquisition units: రాష్ట్రంలోని వివిధ జల వనరుల ప్రాజెక్టులకు సంబంధించిన 29 భూసేకరణ యూనిట్ల గడువును.. 2023 డిసెంబరు 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. పోలవరం ప్రాజెక్టు, బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు (బీజేఆర్‌యూఎస్‌ఎస్‌)లకు సంబంధించి కొత్తగా 7 భూసేకరణ యూనిట్లను ఏర్పాటు చేస్తూ మరో జీవో జారీ చేసింది. 2022 జూన్‌ 1 నుంచి రద్దవుతున్న 9 భూసేకరణ యూనిట్లలో పని చేస్తున్న సిబ్బంది తదుపరి పోస్టింగ్‌ కోసం సంబంధిత జిల్లా కలెక్టర్లకు రిపోర్టు చేయాలని తెలిపింది.

రాష్ట్రంలోని జల వనరులశాఖ పరిధిలో వివిధ భూసేకరణ యూనిట్లలో అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందితో కలిపి 1,131 పోస్టుల్ని కొనసాగించేందుకు ప్రభుత్వం లోగడే అంగీకరించింది. ఇప్పుడు ఉత్తర్వులు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, సహాయ పునరావాస పనుల నిమిత్తం ఇప్పుడు కొత్తగా 6 యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కోసం అనకాపల్లిలో ఒక యూనిట్‌ ఏర్పాటవుతుంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details