ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తాగొచ్చిన ఆబ్కారీశాఖ అధికారి... నిర్బంధించిన ఆదివాసులు

By

Published : Nov 7, 2020, 5:28 PM IST

తెలంగాణలోని కుమురంభీం జిల్లా జైనూరు లెండిగూడలో ఆబ్కారీశాఖ అధికారులను ఆదివాసులు నిర్బంధించారు. మద్యం సేవించి.. తమ ఆచారాలకు విరుద్ధంగా బూట్లు వేసుకుని.. మగవారు లేని సమయంలో ఇళ్లల్లో అధికారులు తనిఖీలు నిర్వహించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

excise-officers detained
excise-officers detained

తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్ మండలం లెండిగూడ ఆదివాసీలు ఎక్సైజ్​ అధికారుల తీరుపై మండిపడ్డారు. మద్యం సేవించి తమ ఆచారాలకు విరుద్ధంగా బూట్లు వేసుకుని.. తమ ఇళ్లల్లో ఆబ్కారీ శాఖ తనిఖీలు నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం నిల్వ చేస్తున్నారనే నెపంతో ఇళ్లల్లో ఆడవాళ్లు మాత్రమే ఉన్న సమయంలో అధికారులు సోదాలు నిర్వహించడం పట్ల ఆగ్రహానికి గురైన వారు.. ఎక్సైజ్ అధికారులను చుట్టుముట్టి నిర్బంధం చేశారు.

ఆబ్కారీ శాఖ అధికారి నరహరి చారి మద్యం సేవించి తనిఖీ నిర్వహించారని ఆరోపిస్తూ.. అతని వాహనాన్ని అడ్డుకొని జైనూర్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. అతన్ని బ్రీత్​ ఎనలైజర్​ ద్వారా పరీక్ష చేయగా మద్యం సేవించినట్టు నిర్ధరణ అయ్యింది. నరహరిపై కేసు నమోదు చేసి.. విచారణ జరపాలని లెండిగూడ గ్రామస్థులు డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details