ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాడిసన్ బ్లూ పబ్​ కేసులో ట్విస్ట్.. 24 గంటలూ పర్మిషన్ ఉందట..!

By

Published : Apr 3, 2022, 6:41 PM IST

Radisson Blu Pub: బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ ఇచ్చింది ఎక్సైజ్ శాఖ. సంచలనంగా మారిన రాడిసన్ బ్లూ పబ్​కు 24 గంటలు నడుపుకునే అనుమతి ఉందని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం సెప్టెంబర్​ వరకు పబ్​కు అన్ని రకాల అనుమతులూ ఉన్నాయని స్పష్టం చేశారు.

http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/03-April-2022/14917756_751_14917756_1648987414486.png
http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/03-April-2022/14917756_751_14917756_1648987414486.png

Radisson Blu Pub: హైదరాబాద్‌ రాడిసన్‌ బ్లూ ప్లాజా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు సెప్టెంబర్ వరకు 24 గంటలు నడుపుకోవడానికి అనుమతి ఉందని ఎక్సైజ్‌ శాఖ స్పష్టం చేసింది. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వహణకు లైసెన్స్‌ ఫీజు కింద రూ.52,66,700 వసూలు చేయడం.. 24 గంటలు బార్‌ నడుపుకోడానికి అదనంగా మరో రూ.14లక్షలు రాడిసన్‌ బ్లూ ప్లాజా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యాజమాన్యం చెల్లించినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. నాలుగు అంతకంటే ఎక్కువ నక్షత్రాలు ఉన్న హోటల్స్‌ 24 గంటలు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వహించుకోడానికి అనుమతి ఇచ్చినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు.

పోలీసులు దాడులు నిర్వహించిన సమయంలో మాదకద్రవ్యాలు లభ్యమైనట్లు తమకు సమాచారం ఉందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. పోలీసు శాఖ విచారణలో ఏమి తేలుతుందన్నది చూడాలని, ఆ శాఖ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా ఎక్కడైనా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ లైసెన్స్‌ నిబంధనలను ఉల్లంఘనలకు పాల్పడి ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే రాడిసన్ బార్‌కు చెందిన అన్ని అనుమతి పత్రాలనూ పరిశీలించినట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. పత్రాల వరకు అన్నీ సక్రమంగానే ఉన్నాయని స్పష్టం చేశారు.

అసలేం జరిగింది? : హైదరాబాద్​ బంజారాహిల్స్‌ రాడిసన్‌ హోటల్‌లోని పుడింగ్‌ అండ్‌ మింట్‌ పబ్‌లో మాదకద్రవ్యాలు బయటపడిన సంగతి తెలిసిందే. పక్కా సమాచారంతో రాత్రి పబ్‌పై దాడులు నిర్వహించి మత్తుపదార్థాలు పట్టుకున్నారు పోలీసులు. పబ్‌పై కేసు నమోదు చేసి.. యజమాని సహా 144 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సినీనటి నిహారిక, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ కూడా ఉన్నారు. నిహారికకు పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించారు. అదుపులోకి తీసుకున్నవారందనీ విచారించిన పోలీసులు.. వారి వివరాలు సేకరించి వదిలేశారు.

సంబంధిత కథనాలు..

ABOUT THE AUTHOR

...view details