ఆంధ్రప్రదేశ్

andhra pradesh

VUNDAVALLI ARUN KUMAR COMMENTS ON JAGAN: 'సీఎంగా జగన్ ఇంత ఘోరంగా విఫలమవుతాడని ఊహించలేదు'

By

Published : Nov 27, 2021, 1:54 PM IST

VUNDAVALLI ARUN KUMAR COMMENTS ON CM JAGAN: రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోతుందని.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ విమర్శించారు. ఇప్పటివరకూ చేసిన అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు తెస్తామని చెప్పడమే.. జగన్​ వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు.

ex-mp-undavalli-arun-kumar-comments-on-cm-jagan
'సీఎంగా జగన్ ఇంత ఘోరంగా విఫలమవుతాడని ఊహించలేదు'

'సీఎంగా జగన్ ఇంత ఘోరంగా విఫలమవుతాడని ఊహించలేదు'

VUNDAVALLI ARUN KUMAR COMMENTS ON YCP CONGRESS: అధికారంలో ఉన్నంతవరకు అప్పులపై నెట్టుకొచ్చి.. ఆ తర్వాత రాష్ట్రాన్ని రోడ్డుపై పడేయటమే వైకాపా ఉద్దేశంగా కనిపిస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. సీఎంగా జగన్‌ ఇంత ఘోరంగా విఫలమవుతాడని ఊహించలేదన్నారు. ఇప్పటివరకు చేసిన అప్పులు తీర్చడానికి.. మళ్లీ అప్పులు తెస్తామని చెప్పడం దారుణమన్నారు. ఇందుకోసం ఎఫ్​ఆర్​ఎంబీ (FRMB) చట్టాన్ని ఇష్టారీతిన సవరించడం సరికాదని సూచించారు.

అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లేనని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రతిపక్షం సలహాలు తీసుకుంటేనే.. ప్రభుత్వానికి పేరు వస్తుందని సూచించారు. చంద్రబాబును అగౌరవంగా మాట్లాడుతుంటే.. సీఎం జగన్ ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనుకునేంత అవివేకం ఇంకోటి లేదన్నారు. అలాగే 3 రాజధానుల బిల్లు ఉపసంహరించి మళ్లీ పెడతాననడం ప్రభుత్వ వైఫల్యమేనని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details