ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాబడి తగ్గడానికి ప్రభుత్వ వైఫల్యాలే కారణం:యనమల

By

Published : Apr 19, 2020, 1:52 PM IST

గత ఏడాది రాబడులు తగ్గడానికి వైకాపా ప్రభుత్వ వైఫల్యాలే కారణమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. లాక్ డౌన్ ప్రభావంతో రాబడి తగ్గిందని చెప్పటం సరికాదని అన్నారు. కేంద్రం నుంచి నిధులు పుష్కలంగా వచ్చినా... వృథా చేస్తున్నారని విమర్శించారు.

ex minister yanamala
ex minister yanamala

గత ఏడాది రాబడులు తగ్గడానికి వైకాపా ప్రభుత్వ వైఫల్యాలే కారణమని తెదేపా సీనియర్ నేత యనమల విమర్శించారు. జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ ప్రభావం మార్చి చివర్లో 9 రోజులు మాత్రమే ఉందని చెప్పారు. కానీ ఈ కారణాలతో రాబడి తగ్గిందని చెప్పడమేంటని ప్రశ్నించారు. గత ఏడాది ఎక్సైజ్ రాబడి రూ. 6536 కోట్లకు పెరగడంపై సీఎం జగన్ ఏం చెబుతారని నిలదీశారు. రూ. 336 కోట్ల మద్యం విక్రయాలు పెరిగాయని ప్రభుత్వ లెక్కలే చెప్పాయని వివరించారు.

కరోనా పేరు చెప్పి ఉద్యోగుల మార్చి జీతాలు, పింఛన్లలో సగం కోత పెట్టారని దుయ్యబట్టారు. పేదల సంక్షేమ పథకాల్లో భారీ కోతలు పెట్టారని... పలు పథకాలను రద్దుచేశారని ఆరోపించారు. ఏడాదిగా కేంద్రం నుంచి నిధులు పుష్కలంగా వచ్చాయన్న యనమల... కరోనా కోసం అదనపు నిధులు వచ్చాయనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రజా వ్యతిరేక చర్యలపై కోర్టుల్లో వాదనలకు భారీగా నిధులు వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details